Raghava Lawrence: ఆ స్వామి అనుగ్రహంతోనే ఈ అదృష్టం

ABN , First Publish Date - 2023-09-06T20:56:56+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’ సీక్వెల్‌ (రెండో భాగం)లో నటించే అదృష్టం తాను కొలిచే ఆ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం వల్లే లభించిందని ఆ చిత్ర హీరో రాఘవ లారెన్స్‌ అన్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి-2’ చిత్రం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈనెల 15న విడుదలకానుంది.

Raghava Lawrence: ఆ స్వామి అనుగ్రహంతోనే ఈ అదృష్టం
Chandramukhi 2 Movie Team

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) నటించిన ‘చంద్రముఖి’ సీక్వెల్‌ (రెండో భాగం)లో నటించే అదృష్టం తాను కొలిచే ఆ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం వల్లే లభించిందని ఆ చిత్ర హీరో రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) అన్నారు. పి. వాసు (P Vasu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2) చిత్రం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈనెల 15న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా, తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, హీరో రాఘవ లారెన్స్‌, ఇతర పాత్రలను పోషించిన సృష్టి డాంగే, సుభిక్ష, రవివర్మ ప్రసంగించారు.


ఈ సందర్భంగా రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ (Raghava Lawrence About Chandramukhi 2).. నా ఆధ్యాత్మిక గురువు తలైవర్‌ (రజనీ) పోషించిన వేట్టయన్‌ పాత్ర ఆ రాఘవేంద్రస్వామి అనుగ్రహం వల్లే లభించింది. ఆ పాత్రతో నా పాత్రకు పోలిక పెట్టొద్దు. తొలి భాగంలో వేట్టయన్‌ రజనీ... రెండో భాగంగా వేట్టయన్‌ లారెన్స్‌. మొదటి భాగం కంటే రెండో భాగం చాలా బాగా ఉంటుంది. ప్రధాన మూల కథ ఇందులో ఉంది. చంద్రముఖి పాత్రను కంగనా రనౌత్‌ అద్భుతంగా పోషించారు. ఇతర పాత్రధారులు కూడా తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణితో కలిసి పనిచేయడం అదృష్టం. దర్శకుడు పి.వాసు వద్ద ఒక డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, హీరోగా పనిచేశాను. నా బ్యానరులో ఆయన దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కించేందుకు సైతం సిద్ధంగా ఉన్నా. ఆ అవకాశం ఇంకా రాలేదని అన్నారు.

Lawrence.jpg

కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మాట్లాడుతూ.. తమిళంలో ఇది నా మూడో చిత్రం. మూడు వేర్వేరు కథల్లో నటించా. తొలిభాగంలో చంద్రముఖిగా జ్యోతిక పాత్రకు, నా పాత్రకు పోలిక పెట్టొద్దని అన్నారు. అలాగే, హీరోయిన్లు సృష్టి డాంగే, సుభిక్ష, నటుడు రవివర్మ మాట్లాడారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై నిర్మాత సుభాస్కరన్‌ నిర్మించగా.. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Narayana and Co: ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్..

*************************************

*Ala Ninnu Cheri: నిన్నటి కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా.. క్రిష్ వదిలిన ప్రేమ సాంగ్

*************************************

*Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్

*************************************

*Skanda: ‘స్కంద’ వినాయక చవితికి రావట్లేదు.. ఎప్పుడో తెలుసా?

**************************************

Updated Date - 2023-09-06T20:56:56+05:30 IST