కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది

ABN, First Publish Date - 2023-10-03T19:55:07+05:30

నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతోన్న నేపధ్యంలో.. మేకర్స్ తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Hero Sudheer Babu

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Nitro Star Sudheer Babu), యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ (Harshavardhan) దర్శకత్వంలో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (Sree Venkateswara Cinemas) ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలవుతోన్న నేపధ్యంలో.. మేకర్స్ తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు (Sudheer Babu Speech) మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. నాకు నటుడిగా జీవితాన్ని ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి కృతజ్ఞతలు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నాను. ‘మామా మశ్చీంద్ర’ కథ నచ్చి సినిమా నిర్మించిన సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ గారికి థాంక్స్. ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన్ని మిస్ అవుతున్నాం. మంచి సినిమా చేశాం. ఆయనకి ఈ సినిమా అకింతం చేయొచ్చని అనుకుంటున్నాం. ఈ సినిమాకి పని చేసిన టీం అందరికీ థాంక్స్.


ఈషా చాలా చక్కగా నటించింది. తనకి, దుర్గాకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఆసక్తికరంగా వుంటాయి. మిర్నాళిని రవి, నాకు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఖుషి సినిమాని గుర్తు చేస్తాయి. దర్శకుడు హర్ష ఇందులో ఓ కీలక పాత్ర చేశారు. సినిమా పూర్తయ్యే సరికి ఈ పాత్ర చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. దర్శకుడిగా తన గురించి చెప్పాలంటే రచయితలు ఆగిపోయిన దగ్గర నుంచి తను మొదలవుతాడు. తన ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. ఇందులో చాలా సర్ప్రైజ్ లు వుంటాయి. ప్రతి పది నిమిషాలకు ఒక మలుపు వస్తుంది. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. (Mama Mascheendra Pre Release Event)

దుర్గా పాత్ర గెటప్ వేసుకొని సెట్స్‌కి వెళ్ళినప్పుడు చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. అలాగే పరశురాం రోల్ కూడా చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఈ సినిమాలో మంచి కథ, పాటలు, వినోదం అన్నీ వుంటాయి. కథ యూనిక్‌గా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఒత్తిళ్ళు వుంటాయి. ‘మామ మశ్చీంద్ర’ సినిమా చూస్తున్నపుడు ఆ ఒత్తిళ్ళు అన్నీ మరిచిపోతారు. సినిమా మహేష్ బాబు గారిలా పరిగెడుతుంది (నవ్వుతూ). సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు కొత్త రకం కథ, కొత్తగా వుందని ప్రేక్షకులు ఫీలవుతారు. అక్టోబర్ 6న విడుదలవుతోన్న ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు

***********************************

*Siddharth: తెలుగులో సిద్ధార్థ్ సినిమాని ఎవరు చూస్తారని అన్నారట.. సిద్ధార్థ్ ఏడ్చేసినంత పనిచేశాడు

**********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల ఎప్పుడంటే..


***********************************

*Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?

**************************************

*Yendira Ee Panchayithi Trailer: పైసాకైనా.. పడకకైనా.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే!

*************************************

Updated Date - 2023-10-03T19:55:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!