సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sony Charishta: ఈ ‘ఇద్దరు’ నా కెరీర్‌లో ఓ మైలురాయి..

ABN, First Publish Date - 2023-07-05T17:59:33+05:30

‘ఇద్దరు’ అనే ఈ చిత్రం నా కెరీర్‌లో ఓ మైలురాయి.. నాకెన్నో మంచి మెమరీస్‌ని ఈ చిత్రం ఇచ్చిందని అన్నారు అందాల హీరోయిన్ సోని చరిష్టా. జూలై 7న ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా సోని చరిష్టా ప్రత్యేకంగా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇందులో సీనియర్ నటీనటులతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఓ మంచి మెమరీగా ఉంటుందని ఆమె అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun), రాధికా కుమారస్వామి (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య), సోని చరిష్టా (Sony Charishta) హీరోహీరోయిన్లుగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఇద్దరు’ (Iddaru). ఎఫ్.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో.. ఎస్.ఎస్. సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 7న (జులై 7) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటుడు జె.డి.చక్రవర్తి (JD Chakravarthy), అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ (Faisal Khan), స్వర్గీయ కె.విశ్వనాథ్ (K Viswanath) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్ సోని చరిష్టా.. చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు సమీర్ గారికి నా కృతజ్ఞతలు. యాక్షన్ కింగ్ అర్జున్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. రాధికా కుమారస్వామి (Radhika Kumaraswamy) కూడా ఎంతగానో సపోర్ట్ అందించారు. ‘ఇద్దరు’ అనే ఈ చిత్రం నా కెరీర్‌లో ఓ మైలురాయి. నాకెన్నో మంచి మెమరీస్‌ని ఈ చిత్రం ఇచ్చింది. ఈ సినిమా విడుదల తర్వాత నా పాత్ర గురించి అంతా మాట్లాడుకుంటారు. దర్శకుడు మంచి పాత్రని ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాత ఫర్హీన్ ఫాతిమాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జూలై 7న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని అంతా చూసి.. సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు. (Sony Charishta About Iddaru)

అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఇందులో ఉన్నట్లుగా దర్శకనిర్మాతలు తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి. చక్రవర్తి పోటాపోటీగా నటించిన ఈ చిత్రం.. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని తెలుపుతూ.. సినిమా విడుదలకు సహకరించిన అందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Devil Glimpse: గూఢచారి‌కి ఉండాల్సిన ముఖ్యలక్షణం ఏమిటో.. కళ్యాణ్ రామ్ మాటల్లో..!

**************************************

*Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*Bharatheeyans: మనం చైనాకు లొంగిపోతున్నామా?.. ‘భారతీయన్స్’ నిర్మాత ఆవేదన

**************************************

Updated Date - 2023-07-05T18:12:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!