Shakuntalam: ‘శాకుంతలం’ ప్రచార సునామీకి ముందు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు

ABN , First Publish Date - 2023-03-14T23:16:05+05:30 IST

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’ (Shakuntalam). ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత (Samantha), దేవ్ మోహన్ (Dev Mohan) జంటగా నటించారు. ఈ విజువల్ వండర్

Shakuntalam: ‘శాకుంతలం’ ప్రచార సునామీకి ముందు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు
Shakuntalam Movie Team

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’ (Shakuntalam). ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత (Samantha), దేవ్ మోహన్ (Dev Mohan) జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ (GunaSekhar) రూపొందించారు. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా (Pan India) చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దిల్‌రాజు (Dil Raju), గుణ శేఖ‌ర్ అండ్ టీమ్‌. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మేక‌ర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేయ‌టానికి ప్లాన్‌ను సిద్ధం చేశారు. రీసెంట్‌గానే శాకుంత‌లం ఫ‌స్ట్ కాపీ (1st Copy)ని చూసినట్లుగా చెబుతూ.. సమంత (Samantha), గుణశేఖర్, దిల్ రాజు సహా టీమ్ స‌భ్యులంద‌రూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత నీలిమ గుణ (Producer Neelima Guna) మాట్లాడుతూ.. ‘‘సినిమా అంటే ప్యాషన్ ఉండే ఇద్ద‌రు వ్య‌క్తులు దిల్ రాజుగారు, గుణ శేఖ‌ర్‌గారు. వారి కాంబోలో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందో అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ‘శాకుంత‌లం’. అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించాం. మ‌న సినిమా రేంజ్‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా మా వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. టీమ్ అందరం సినిమాను చూశాం. ఔట్ పుట్‌పై చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజ్ కావ‌టానికి ఇంకా నెల రోజులు ఉండ‌గానే ఫ‌స్ట్ కాపీ రెడీ చేశాం. అది కూడా అన్నీ లాంగ్వేజెస్‌లో. ఇక ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయ‌బోతున్నాం. మార్చి 15న పెద్దమ్మ తల్లి (Peddamma Temple)ని దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాం. అక్క‌డి నుంచి కంటిన్యూగా శాకుంత‌లం సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో జ‌నాల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశాం. ఈ వేస‌విలో మా వరల్డ్ ఆఫ్ శాకుంతలం (World Of Shakuntalam) ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు చిన్న పిల్ల‌ల‌ను సైతం మెస్మ‌రైజ్ చేస్తుంది. ప్ర‌తి ఫ్రేమ్ వావ్ అనిపించేంత గొప్ప‌గా, అందంగా ఉంటుంది. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున శాకుంతలం సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు. (Shakuntalam Latest Update)

ఇవి కూడా చదవండి:

*********************************

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Dasara Trailer: ఇదీ ట్రైలర్‌ అంటే.. ఒక్కొక్కనికి రాల్తాయ్!!

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

Updated Date - 2023-03-14T23:16:07+05:30 IST