Samantha: తన ఆరోగ్యం గురించి సమంత ఏం చెప్పిందంటే..?

ABN , First Publish Date - 2023-03-25T18:17:23+05:30 IST

టాప్ హీరోయిన్ సమంత (Samantha) తాజాగా నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Samantha: తన ఆరోగ్యం గురించి సమంత ఏం చెప్పిందంటే..?

టాప్ హీరోయిన్ సమంత (Samantha) తాజాగా నటించిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా సామ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మయోసైటిస్ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్నట్టు చెప్పారు.

‘‘మయోసైటిస్‌ వ్యాధి బారిన పడిన తొలిరోజుల్లో చాలా బలహీనంగా ఉండేది. ‘యశోద’ అప్పుడు ఆరోగ్యం బాగా క్షీణించింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి అయినప్పటికీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఎన్నో మందులు తీసుకోవాల్సి ఉండేది. సినిమా భారం నా భుజాలపై ఉండటంతో బాధ్యతగా భావించి అతి కష్టంగానే ఒక ఇంటర్వ్యూ అయినా ఇవ్వాలనుకున్నా. ఆ తర్వాత నా ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. ప్రస్తుతం ‘శాకుంతలం’ కు వచ్చే సరికి ఆరోగ్యం కొంచెం సహకరిస్తోంది. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్నాను. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ తర్వాత శాకుంతలం కథ నా దగ్గరికి వచ్చింది. గుణశేఖర్ ఈ కథ చెప్పగానే వెంటనే సున్నితంగా తిరస్కరించా. అయినప్పటికీ ఆయన నన్ను ఒప్పించారు. చిత్రంలోని పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. వ్యాయామాలు, వర్కవుట్స్, డైట్ మార్చుకున్నా’’ అని సమంత తెలిపారు.

Sam.jpg

‘శాకుంతలం’ ను గుణ టీమ్ వర్క్స్‌తో కలసి టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో దేవ్‌ మోహన్‌, సచిన్‌ ఖేడ్కర్‌, ప్రకాష్ రాజ్, మోహన్‌బాబు, అదితి బాలన్‌, అనన్య నాగళ్ల, మధు షా కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండతో కలసి సామ్ ‘ఖుషి’ (Kushi) లోను నటిస్తున్నారు. ‘సిటడెల్‌’ (Citadel) ఇండియా వెబ్‌సిరీస్‌‌లోను కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ షోలో వరుణ్ ధావన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆమె గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-25T18:20:19+05:30 IST