Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

ABN , First Publish Date - 2023-03-02T21:08:17+05:30 IST

నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భాంత్రికి గురయింది. ఆయన మరణం కటుంబ సభ్యులకు తీవ్ర వేదనను మిగిల్చింది. భర్త దూరం కావడంతో తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy) విషాదంలో కూరుకుపోయారు..

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భాంత్రికి గురయింది. ఆయన మరణం కటుంబ సభ్యులకు తీవ్ర వేదనను మిగిల్చింది. భర్త దూరం కావడంతో తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy) విషాదంలో కూరుకుపోయారు. అయితే, ఆయన పెద్దకర్మ మార్చి 2న హైదరాబాద్​లోని ఫిలింనగర్​ కల్చరల్​ సెంటర్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా తారకరత్న రాసిన లేఖను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసి భావోద్వేగానికి గురయ్యారు.

ప్రేమికుల రోజు సందర్భంగా అలేఖ్యకు తారకరత్నలేఖ రాశారు. ఈ నోట్‌ను అలేఖ్య తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ముందుగా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. నేను భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరచలేనని నీకు తెలుసు. అయినప్పటికీ ఒక అడుగు ముందుకేసి నీకు ఒక మాట చెబుతున్నాను. ఐ లవ్ యూ.. నా కంటే ఎక్కువగా నిన్నే నేను ప్రేమిస్తాను. కొన్ని సార్లు నీతో ఘోరంగా ప్రవర్తించి ఉండొచ్చు. అది ప్రేమతోనే కానీ ద్వేషంతో మాత్రం కాదు. నాతో కలిసి జీవించడం కొంచెం కష్టమని నాకు తెలుసు. అన్ని వేళలా నాకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నువ్వే నా ప్రపంచం బంగారు. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అని తారకరత్న రాసిన లేఖను అలేఖ్య రెడ్డి షేర్ చేశారు. ఈ నోట్‌ను షేర్ చేస్తూ అలేఖ్య భావోద్వేగపూరితంగా కామెంట్ చేశారు. ‘‘మేం జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాం. ఎత్తు, పల్లాలను చూశాం. అయినప్పటికీ జంటగా అన్నింటిని అధిగమించాం. ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా లోపలనే దాచుకుని మాకు అపారమైన ప్రేమను అందించావు’’ అని అలేఖ్య కామెంట్ చేశారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-02T22:09:09+05:30 IST