కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roti Kapda Romance: అరెరె అరెరె.. మ్యూజిక్ సెన్సేష‌న్ థమ‌న్ కూడా..

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:11 PM

లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర సెకండ్ డోస్ అరెరె అరెరె అంటూ సాగే పాటని మ్యూజిక్ సెన్సేషన్ థమన్ విడుదల చేశారు.

Roti Kapda Romance Movie Song Launch Event

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal).. సృజన్‌ కుమార్ బొజ్జం (Srujan Kumar Bojjam)తో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapda Romance). హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి (Vikram Reddy) దర్శకుడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజ‌ర్‌) మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర సెకండ్‌ డోస్‌లో మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman) భాగమయ్యారు. ఈ సినిమా సెకండ్ డోస్ ‘అరెరె.. అరెరె’ (Arere Arere Song) అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను థమన్ విడుద‌ల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పాట విషయానికి వస్తే.. ఆర్‌.ఆర్. ధ్రువ‌న్ సంగీతాన్ని అందించిన ఈ పాట‌కు ర‌ఘ‌రామ్ సాహిత్యం అందించ‌గా, క‌పిల్ క‌పిల‌న్ ఆల‌పించారు. పాట విడుదల అనంతరం థమ‌న్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా క‌నిపిస్తుంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.ఆర్ ధ్రువ‌న్ మ‌ల్టీ టాలెంటెడ్‌. పాట‌ల ర‌చ‌యిత‌గా, సింగ‌ర్‌గా త‌ను నాకు తెలుసు. ఈ చిత్రంతో అత‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా మార‌డం ఎంతో ఆశ్చ‌ర్యంగా వుంది.. న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఈ సాంగ్‌ను నేను లాంచ్ చేయ‌డం హ్య‌పీగా వుంది. విన‌గానే షూర్ షాట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్‌లా అనిపించింది. ఈ పాట‌లో చాలా పాజిటివ్ వైబ్స్ వున్నాయి. త‌ప్ప‌కుండా ఈ పాట సినిమా విజ‌యంలో ముఖ్య భూమిక పోషిస్తుందని నమ్ముతున్నాను. పాట‌తో పాటు చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. థమ‌న్ చేతుల మీదుగా ఈ పాట విడుద‌ల కావ‌డం ఎంతో సంతోషంగా వుంద‌ని చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.ఆర్. ధ్రువ‌న్ తెలిపారు. (Roti Kapda Romance Movie Arere Arere Song Launched)


చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. థమన్ మా సినిమా పాట‌ను విడుద‌ల చేయ‌డం శుభ‌సూచ‌కంలా అనిపిస్తుంది. ఈ చిత్రం న‌లుగురు స్నేహితుల క‌థ. వారి స్నేహం, ప్రేమ‌, వారి లైఫ్ జ‌ర్నీ ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అభిరుచి గ‌ల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి సృజన్‌ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మించారు. త‌ప్ప‌కుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా వుంటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

**************************

*Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!

****************************

*Rajinikanth: రజినీకాంత్‌పై వరద బాధితుల అసహనం!

*****************************

*Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

****************************

*Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

**************************

Updated Date - Dec 28 , 2023 | 10:11 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!