Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!

ABN , Publish Date - Dec 28 , 2023 | 08:30 PM

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. తన ఆత్మకథ చెబితే ఎవరు మాత్రం తెలుసుకోవాలని అనుకోరు. తన జీవితం గురించిన విషయాలతో పాటు.. తనకు తెలిసిన కొన్ని మంచి మాటలను ఆయన ‘నేను’ పేరుతో పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు. ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!
Megastar Chiranjeevi Couple and Brahmanandam

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) పేరు వినబడినా, ఆయన ఏదైనా ఫంక్షన్‌కు హాజరైనా.. చుట్టూ ఆనందమే ఉంటుంది. కమెడియన్‌గా బ్రహ్మానందం ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరినీ ప్రతి రోజూ నవ్విస్తూనే ఉంటారు. అందుకే ఆయన హాస్యబ్రహ్మ అయ్యారు. ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాల్లో నటించడం తగ్గించారు. కొత్త నీరు వస్తే పాత నీరు కాస్త సైడ్ అవడమే మంచిదని భావించే బ్రహ్మి.. కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ, తన గొప్పతనాన్ని చాటుతున్నారు. ఒక పంతులు స్థాయి నుంచి సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ కమెడియన్‌ (Star Comedian)గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఈ మధ్య లేదు కానీ.. కొన్నేళ్ల పాటు ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. కమెడియన్‌గా ఆయన పోషించినన్ని పాత్రలు మరొకరు పోషించలేదనే చెప్పుకోవాలి.

అలాంటి బ్రహ్మానందం.. తన ఆత్మకథ చెబితే ఎవరు మాత్రం తెలుసుకోవాలని అనుకోరు. తన జీవితం గురించిన విషయాలతో పాటు.. తనకు తెలిసిన కొన్ని మంచి మాటలను ఆయన ‘నేను’ (Nenu) పేరుతో పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు. ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తన ఆత్మకథ (Brahmanandam Biography)ని పుస్తకంగా మలిచిన హాస్యబ్రహ్మకు, ఆ పుస్తకాన్ని ప్రచురించిన ‘అన్వీక్షికి’ మెగాస్టార్ అభినందనలు తెలియజేశారు.


Brahmanandam.jpg

‘‘నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందించటం ఎంతో ఆనందదాయకం. తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు, మార్గదర్శకము అవ్వొచ్చు’. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ.. ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను!’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Rajinikanth: రజినీకాంత్‌పై వరద బాధితుల అసహనం!

*****************************

*Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

****************************

*Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

**************************

Updated Date - Dec 28 , 2023 | 08:30 PM