Bheemadevarapally Branch: అనుకోకుండా బ్యాంక్ ఖాతాలో పడిన డబ్బుల్ని వాడేస్తే వచ్చే ప్రాబ్లమ్స్‌‌ని చెప్పే కథ

ABN , First Publish Date - 2023-06-22T18:38:10+05:30 IST

అందమైన ఓ పల్లెటూరు కథ ఇది. అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే, ప్రభుత్వాలు ఇచ్చాయనుకుని.. ఖర్చు చేసేస్తే ఆ తర్వాత తలెత్తిన పర్యవసానాలు ఏమిటన్నది ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా మెయిన్ పాయింట్ అని అంటున్నారు చిత్ర నిర్మాత రాజా నరేందర్.

Bheemadevarapally Branch: అనుకోకుండా బ్యాంక్ ఖాతాలో పడిన డబ్బుల్ని వాడేస్తే వచ్చే ప్రాబ్లమ్స్‌‌ని చెప్పే కథ
Bheemadevarapally Branch Movie Team

రాజా నరేందర్ చెట్లపల్లి (Raja Narendar CH) నిర్మాతగా.. రమేష్ చెప్పాలా (Ramesh Cheppala) రచన, దర్శకత్వంలో జూన్ 23న విడుదల కాబోతున్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’ (Bheemadevarapally Branch). అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్), రాజవ్వ, కీర్తి లత, అభిరామ్ తదితరులు నటించిన ఈ సినిమా.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అంటున్నారు చిత్ర నిర్మాత రాజా నరేందర్ చెట్లపల్లి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘అందమైన ఓ పల్లెటూరు కథ ఇది. అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే, ప్రభుత్వాలు ఇచ్చాయనుకుని.. ఖర్చు చేసేస్తే ఆ తర్వాత తలెత్తిన పర్యవసానాలు ఏమిటన్నది ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా మెయిన్ పాయింట్. దర్శకుడు రమేష్ చెప్పాలా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక ఆలోచనతో బయటికి వస్తారు. నిర్మాతగా నేను నా మొదటి సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. (Raja Narendar CH about Bheemadevarapally Branch)

ఇంకా ఆయన మాట్లాడుతూ.. సినిమా అంతా సరదాగా నడుస్తూనే.. ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఉంటుందని అన్నారు. అలాగే చరణ్ అర్జున్ (Chran Arjun) సంగీతం, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, కె. చిట్టిబాబు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన హైలెట్స్‌గా ఉంటాయని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టేశారని.. తప్పకుండా థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులని ఈ సినిమా అలరిస్తుందని నిర్మాత రాజా నరేందర్ చెట్లపల్లి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Agent: రైట్స్ విషయంలో దేవుడు కాపాడాడు .. ఏషియన్ సునీల్ సంచలన వ్యాఖ్యలు


**************************************

*Pawan Kalyan: జగన్ రెడ్డి వల్ల నాకు ఎన్ని కోట్లు లాసో తెలుసా? ఆ లాస్ నేనే భరించా?


**************************************

*Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు


**************************************

*Regina: ‘రెజీనా’ కోసం ఈ హీరోయిన్ చేసిన సాహసం ఏంటో తెలుసా?


**************************************

*Natti Kumar: పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి చేసిన విమర్శలపై నట్టికుమార్ ఫైర్


**************************************

*Adipurush: డైరెక్టర్‌దే కాదు.. 50 శాతం ప్రభాస్ తప్పు కూడా ఉంది.. నటి సంచలన వ్యాఖ్యలు

**************************************

*Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్‌ సీన్‌.. రచ్చ రచ్చ అవుతోంది

**************************************

Updated Date - 2023-06-22T19:39:57+05:30 IST