Agent: రైట్స్ విషయంలో దేవుడు కాపాడాడు .. ఏషియన్ సునీల్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-21T23:29:33+05:30 IST

అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఏజెంట్’ చిత్రం.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాపై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన ఏషియన్ సునీల్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా హక్కులు మాకు రాకుండా దేవుడు కాపాడాడు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Agent: రైట్స్ విషయంలో దేవుడు కాపాడాడు .. ఏషియన్ సునీల్ సంచలన వ్యాఖ్యలు
Akhil Akkineni and Asian Suniel

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటించిన ‘ఏజెంట్’ (Agent) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలలోనే పెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇంత వరకు అఖిల్ మీడియా ముందుకు రాలేదు. అలాగే తన తదుపరి సినిమా విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమాలు చేస్తాడో.. లేదో అనేలా కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయంటే.. అఖిల్‌కు ‘ఏజెంట్’ ఎలాంటి అనుభవాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. తాజాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన ఏషియన్ సునీల్ (Asian Suniel) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

‘అఖిల్ ఏజెంట్ సినిమా హక్కులను మేము తీసుకోవాలని నిర్మాతను సంప్రదించాం. కానీ నిర్మాత భారీగా డిమాండ్ చేశారు. అంత రేటు వర్కౌట్ అవ్వదులే అని భావించి.. మేము తీసుకోవడం లేదులే.. వేరేవారికి ఇచ్చేయండి అని చెప్పాం. నిజంగా ఈ విషయంలో దేవుడు మమ్మల్ని కాపాడాడు’ అని ఏషియన్ సునీల్ చేసినట్లుగా కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఈ సినిమాని వార్తలలో నిలిచేలా చేస్తున్నాయి. అయితే అంతకు ముందు ఈ సినిమాపై నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) షాకింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

agent2.jpg

‘‘అఖిల్ ఏజెంట్ సినిమాని కిల్ చేసింది నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లే. ఈ సినిమాని ఏషియన్ సునీల్ తీసుకున్నారని తెలిసి.. వారిద్దరూ ఈ సినిమాని బయ్యర్స్ ఎవరూ కొనవద్దని, కొన్నా థియేటర్లు ఇవ్వవద్దని చెప్పారు. ఏజెంట్ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా.. తమిళ సినిమా ‘పీఎస్2’కి భారీగా థియేటర్లను బ్లాక్ చేశారు. అదే అఖిల్ సినిమాకు బాగా దెబ్బకొట్టింది’’ అంటూ అప్పట్లో నట్టికుమార్ ఓ ప్రెస్‌మీట్‌లో అన్నారు. ఇప్పుడు ఏషియన్ సునీల్ చెబుతున్న మాటలు వింటుంటే.. నట్టి మాటల్లో వాస్తవం లేదని అనిపిస్తోంది. అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఏజెంట్’ చిత్రం.. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా జూన్ 23న ఓటీటీలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Pawan Kalyan: జగన్ రెడ్డి వల్ల నాకు ఎన్ని కోట్లు లాసో తెలుసా? ఆ లాస్ నేనే భరించా?


**************************************

*Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు


**************************************

*Regina: ‘రెజీనా’ కోసం ఈ హీరోయిన్ చేసిన సాహసం ఏంటో తెలుసా?


**************************************

*Natti Kumar: పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి చేసిన విమర్శలపై నట్టికుమార్ ఫైర్


**************************************

*Adipurush: డైరెక్టర్‌దే కాదు.. 50 శాతం ప్రభాస్ తప్పు కూడా ఉంది.. నటి సంచలన వ్యాఖ్యలు

**************************************

*Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్‌ సీన్‌.. రచ్చ రచ్చ అవుతోంది

**************************************

*Chiranjeevi: పాప పుట్టిన ఘ‌డియ‌లు చాలా మంచివి.. ఆ ప్రభావం కనిపిస్తుంది

**************************************

Updated Date - 2023-06-21T23:29:33+05:30 IST