Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్‌ సీన్‌.. రచ్చ రచ్చ అవుతోంది

ABN , First Publish Date - 2023-06-20T21:34:44+05:30 IST

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నిర్మించిన ‘టీకూ వెడ్స్ షేరు’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో 49 ఏళ్ల నవాజుద్దీన్‌ సిద్ధిఖీ హీరోగా నటించగా.. 21 ఏళ్ల అవనీత్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి మధ్య ఓ లిప్‌లాక్ సీన్‌ను ఈ ట్రైలర్‌లో రివీల్ చేశారు. ఆ కిస్సింగ్ సీన్‌‌పై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ జరుగుతుండగా.. అదే స్థాయిలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కౌంటర్ వేశారు.

Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్‌ సీన్‌.. రచ్చ రచ్చ అవుతోంది
Nawazuddin Siddiqui and Avneet Kaur

సినిమా ఇండస్ట్రీలో 60 ప్లస్ హీరోలు.. 20 ప్లస్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కామనే. దీనికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. ఏ ఇండస్ట్రీ అతీతం కాదు. దీనిపై చాలా కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి అలా నడిచిపోతుంది. దీనిని తప్పు అనలేం.. అలా అనీ సమర్థించలేం. తప్పదు.. భరించాల్సిందే. ఎందుకంటే.. ఆ హీరోలకి ఉన్న ఇమేజ్ అలాంటిది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) వంటివారు 50 ఏళ్లు దాటిన హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తే.. అక్కడి ప్రేక్షకులు చూస్తారా? అలాగే టాలీవుడ్‌లో కూడా. ఇంకా చెప్పాలంటే.. ఆ హీరోల సరసన నటించే సేమ్ ఏజ్ గ్రూపు హీరోయిన్లు కూడా ఉండాలి కదా.. ఇలా లెక్కలేస్తే చాలా ఉంటాయ్ మరి. ఇదంతా ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా?

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నిర్మించిన ‘టీకూ వెడ్స్ షేరు’ (Tiku Weds Sheru) చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో 49 ఏళ్ల నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) హీరోగా నటించగా.. 21 ఏళ్ల అవనీత్‌ కౌర్‌ (Avneet Kaur) హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి మధ్య ఓ లిప్‌లాక్ సీన్ (liplock Scene) ఉంది. అది ట్రైలర్‌లో రివీల్ చేశారు. అంతే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. ఈ ట్రైలర్‌పై, సినిమాపై విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. లిప్‌లాక్ అనేది బాలీవుడ్‌తో కామనే. కానీ.. ఏజ్ గ్యాప్‌తో జరుగుతున్న ఈ ట్రోల్స్‌పై తాజాగా హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కౌంటర్ వేశారు.

ఆయన మాట్లాడుతూ.. ఏజ్‌ గ్యాప్‌ ఉన్న హీరోహీరోయిన్లు రొమాన్స్ చేయకూడదా? అసలు రొమాన్స్‌కి వయసుతో సంబంధం ఏముంది. బాలీవుడ్‌లో కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌‌గా పిలుచుకునే షారుక్‌ ఖాన్‌ ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్నారుగా. ఆయనతో పోల్చుకుంటే యంగ్‌ హీరోలు కూడా అలా చేయలేకపోతున్నారు. వారంతా రొమాన్స్ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తూ.. అన్నీ వాట్సాప్‌లోనే కానిచ్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మరి ట్రైలర్‌కే ఇంత రచ్చ జరుగుతుంటే.. రేపు సినిమా విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా థియేటర్లలో కాకుండా.. నేరుగా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime video) ఓటీటీలో ఈ నెల 23న విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Chiranjeevi: పాప పుట్టిన ఘ‌డియ‌లు చాలా మంచివి.. ఆ ప్రభావం కనిపిస్తుంది

**************************************

*Heroines: పెళ్లి ముహూర్తానికి వేళాయెరా..


**************************************

*Rakesh Master: గురువు రాకేశ్ మాస్టర్ భౌతికకాయం చూసి కన్నీరుమున్నీరైన శిష్యులు


**************************************

*Bhagavanth Kesari: చిలకపచ్చ కోక.. కాజల్, శ్రీలీల చింపి ఆరేశారు


**************************************

Updated Date - 2023-06-21T18:38:05+05:30 IST