Baahubali: ‘బాహుబలి’ లో ఆ పాత్రకు ఆడిషన్ ఇచ్చా..!

ABN , First Publish Date - 2023-03-08T20:04:57+05:30 IST

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli). భారత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీల మధ్య సరిహద్దులను చెరిపేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’ (Baahubali) అనేక రికార్డులను సృష్టించింది.

Baahubali: ‘బాహుబలి’ లో ఆ పాత్రకు ఆడిషన్ ఇచ్చా..!

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli). భారత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీల మధ్య సరిహద్దులను చెరిపేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. జక్కన్న తెరకెక్కించిన ‘బాహుబలి’ (Baahubali) అనేక రికార్డులను సృష్టించింది. రెండు భాగాలుగా రూపొందిన ‘బాహుబలి’ పాన్‌ ఇండియా మూవీలకు బాటలను వేసింది. ఈ చిత్రంలో నటించిన వారందరికి మంచి గుర్తింపు లభించింది. కానీ, కొన్ని కారణాల వల్ల కొంత మంది మాత్రం ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోలేకపోయారు. అటువంటి వారిలో హీరోయిన్ రాఖీ ఖన్నా (Raashii Khanna) కూడా ఉన్నారు. తాను ‘బాహుబలి’ లో నటించలేకపోవడానికి గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘బాహుబలి’ (Baahubali) టీం నుంచి నాకు కాల్ వచ్చింది. తమన్నా పోషించిన అవంతిక పాత్ర కోసం నేను ఆడిషన్‌ ఇచ్చాను. నాలో అవంతిక పాత్రను రాజమౌళి చూడలేకపోయారు. అందువల్ల తన స్నేహితుడు నిర్మిస్తున్న సినిమాకు నన్ను రిఫర్ చేశారు. అక్కడకు వెళ్లి స్టోరీ వినమన్నారు. నాకు బాగా నచ్చుతుందని చెప్పారు. అలా నేను ఆ నిర్మాత దగ్గరకు వెళ్లి కథ విన్నాను. నేను స్టోరీని వింటున్న సమయంలో రాజమౌళి కూడా అక్కడే ఉండటంతో నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. సౌత్ సినిమాలంటే అంతకు ముందు నాకు సాంగ్స్, డ్యాన్సే అనే భావన ఉండేది. ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) చేసిన తర్వాత నాకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నా నటనకు మంచి పేరు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. అనంతరం తమిళ్‌, మలయాళం, హిందీలో వరుసగా అవకాశాలు వచ్చాయి’’ అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. ఆమె సినిమాలు చేస్తూనే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ‘రుద్ర’ (Rudra) లో నెగెటిల్ రోల్ పోషించింది. తాజాగా ‘ఫర్జీ’ (Farzi) లోను కనిపించింది.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-08T20:04:59+05:30 IST