Premalo Papalu Babulu: ‘ప్రేమలో.. పాపలు బాబులు’కి మురళీ మోహన్ సపోర్ట్

ABN , First Publish Date - 2023-10-02T21:58:39+05:30 IST

శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమలో..’. ఈ సినిమాకు ట్యాగ్‌లైన్ ‘పాపలు బాబులు’. అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరాజ్ బల్లా తెరకెక్కిస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాత. సోమవారం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Premalo Papalu Babulu: ‘ప్రేమలో.. పాపలు బాబులు’కి మురళీ మోహన్ సపోర్ట్
Premalo Movie Motion Poster Launch

శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమలో..’ (Premalo). ఈ సినిమాకు ట్యాగ్‌లైన్ ‘పాపలు బాబులు’ (Papalu Babulu). అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరాజ్ బల్లా (Sri Raj Balla) తెరకెక్కిస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాత. సోమవారం ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగగా.. నటుడు, నిర్మాత మురళీ మోహన్ (Murali Mohan) ముఖ్య అతిథిగా హాజరై, ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోషన్ పోస్టర్ విడుదల అనంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ.. విజయ మాధవి బ్యానర్ అనే పేరు అద్భుతంగా ఉంది. శ్రీ రాజ్ మంచి దర్శక నిర్మాతగా నిలబడతారు. కష్టపడి, ఇష్టపడి చేస్తే ఫలితం కచ్చితంగా వస్తుంది. ప్రేమలో.. పాపలు, బాబులు అనే టైటిల్ కొత్తగా ఉంది. కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. శ్రీరాజ్ సీరియల్స్ చేస్తూనే.. సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. (Premalo Movie Motion Poster Launched)


దర్శకుడు శ్రీరాజ్ మాట్లాడుతూ.. మురళీ మోహన్‌గారిని ఇంతకు ముందు నేను రెండు సార్లు మాత్రమే కలిశాను. ఆయన చాలా గొప్ప నటుడు. మంచి మనిషి. ఇలా మోషన్ పోస్టర్ లాంచ్‌ చేయాలని అడిగిన వెంటనే ఆయన ఓకే చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆయన రావడం సంతోషంగా ఉంది. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా గురువు రామసత్యనారాయణ.. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు ఎలా తీయాలో నాకు నేర్పించారు. సమీర్‌గారు నాకు ఆప్తుడు. నా టీంకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టాలి. ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదించాలని కోరారు. హీరో అభిదేవ్ మాట్లాడుతూ.. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నన్ను నేను నిరూపించుకుంటానని, సినిమాను చూసి ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని చెప్పుకొచ్చారు.

Murali.jpg

నిర్మాత విజయ మాధవి బల్లా మాట్లాడుతూ.. మా ఆయన ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు. ఓ పెద్ద హిట్ కొట్టాలని అనుకుంటూ ఉంటారు. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. గత 22 ఏళ్లుగా సినిమా గురించే ఆలోచిస్తుంటారు. అందుకే నేను నిర్మాతగా మారాను. మా ఆయన కోసమే నేను నిర్మాతగా మారాను. ప్రేక్షకుల ఆశీర్వాదంతో మున్ముందు మరెన్నో మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నానని అన్నారు. నా మిత్రుడు శ్రీరాజ్ తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని సమీర్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?

**************************************

*Yendira Ee Panchayithi Trailer: పైసాకైనా.. పడకకైనా.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే!

*************************************

*R Narayana Murthy: పేపరు లీకేజీలపై పీపుల్ స్టార్ ఎక్కుపెట్టిన అస్త్రం ఎప్పుడంటే..

**************************************

*Anasuya: మా ఆయన అప్పుడప్పుడు చేస్తారు.. నేను మాత్రం ప్రేమగా చేస్తా..!

**************************************

*Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది

************************************

Updated Date - 2023-10-02T21:58:39+05:30 IST