Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది

ABN , First Publish Date - 2023-09-30T22:57:56+05:30 IST

తమిళ చిత్ర పరిశ్రమలోని యంగ్‌ నటీమణులైన శృతి పెరియస్వామి, నిరంజన నైదియర్‌ లెస్బియన్లుగా నటించారు. ‘వాళ్వు తొడంగుమిడం నీదానే’ అనే చిత్రంలో వీరిద్దరూ ముస్లిం, హిందూ యువతులుగా నటించారు. షార్ట్‌ఫ్లిక్స్‌ అనే ఓటీటీ సంస్థతో కలిసి నటి నీలిమ ఇసై దీన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది.

Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది
Suruthi and Niranjana

తమిళ చిత్ర పరిశ్రమలోని యంగ్‌ నటీమణులైన శృతి పెరియస్వామి (Suruthi Periyasamy), నిరంజన నైదియర్‌ (Niranjana Neithiar) లెస్బియన్లుగా నటించారు. ‘వాళ్వు తొడంగుమిడం నీదానే’ (Vaazhvu Thodangumidam Neethanae) అనే చిత్రంలో వీరిద్దరూ ముస్లిం, హిందూ యువతులుగా నటించారు. షార్ట్‌ఫ్లిక్స్‌ అనే ఓటీటీ సంస్థతో కలిసి నటి నీలిమ ఇసై దీన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో లెస్బియన్లుగా నటించడానికి గల కారణాలను శృతి పెరియస్వామి వివరిస్తూ... ‘ఈ చిత్ర కథను డైరెక్టర్‌ వివరించిన తీరు నచ్చింది. ఎందుకంటే నేను రాణించే మోడలింగ్‌ రంగంలో అనేక మంది తమ ప్రతిభను నిరూపించుకునేందుకు జీవన పోరాటం చేస్తున్నారు. ఈ రంగంలో ఉండే అనేక మంది లెస్బియన్స్‌గా జీవిస్తున్నారు. అందుకే ఈ పాత్రలలో నటించాలని తీర్మానించుకున్నా’ అని చెప్పారు.

నిరంజన నైదియర్‌ మాట్లాడుతూ... ‘సమాజంలో జరుగుతున్న అంశాలనే మూలకథగా తీసుకున్నారు. నటిగా దర్శకుడు చెప్పిందే చేస్తా. నన్ను లెస్బియన్‌ మద్దతుదారులా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక చిత్రంలో నటుడు హంతకుడిగా నటిస్తే అతన్ని హత్యలు చేసే వ్యక్తిగా పరిగణిస్తామా? ఈ చిత్రంలో ఒక సమస్యను దర్శకుడు వివరించారు’ అని అన్నారు.


Tamil.jpg

నిర్మాత నీలిమ ఇసై (Neelima Esai) మాట్లాడుతూ... ‘ఈ చిత్రం చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించాం. ఇలాంటి కథతో ఒక సినిమాను నిర్మించాలా? అనే ప్రశ్న ఉత్పన్నమైనపుడు.. నా భర్త ప్రోత్సహించారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. జయరాజ్‌ పళని (Jeyaraj Palani) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం దర్శన్‌ రవికుమార్‌, సహ నిర్మాత నీలిమ ఇసై కాగా.. ఇసై, అదితి ఇసై, అద్వైత ఇసై నిర్మాతలు. ఈ చిత్రం షార్ట్‌ ఫ్లిక్స్‌ తదితర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో సెప్టెంబర్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతూ.. అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటున్నట్లుగా దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*L2 Empuraan: ‘లూసిఫర్ 2’కు లైకా కనెక్షన్.. ఈసారి మాములుగా ఉండదట!

************************************

*Vijay Antony: పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. చిన్నకుమార్తెతో కలిసి విజయ్‌ ఆంటోని ఏం చేశాడంటే..

*************************************

*Namrata and Sitara: మానీక్విన్స్ బొమ్మల కొలువులో నమ్రత, సితూ పాప సందడి

************************************

*Vijay Antony: మరో మెగాస్టార్ చిరు మూవీ టైటిల్‌కి ఫిక్సయిన విజయ్ ఆంటోని

************************************

Updated Date - 2023-10-02T11:29:20+05:30 IST