Bubblegum: రోషన్‌ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..

ABN , First Publish Date - 2023-10-25T10:21:22+05:30 IST

నటుడు రాజీవ్‌ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల ‘బబుల్‌గమ్‌’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జెన్జీ లవ్ స్టోరీ‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. ‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దసరా స్పెషల్‌గా ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ పిక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Bubblegum: రోషన్‌ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..
Bubblegum Movie Still

నటుడు రాజీవ్‌ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల (Roshan Kanakala) ‘బబుల్‌గమ్‌’ (Bubblegum) సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జెన్జీ లవ్ స్టోరీ‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం.. ‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ దర్శకుడు రవికాంత్ పేరెపు (Ravikanth Parepu) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. రీసెంట్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో రోషన్ డైనమిక్ స్క్రీన్ ప్రజెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. యాక్షన్, డైలాగ్.. ఇలా అన్నిట్లోనూ చాలా అనుభవం వున్న నటుడిలా గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ స్టిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.

దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త పోస్టర్‌తో మ్యుూజికల్ ఫెస్ట్‌ని స్టార్ట్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 3న ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. పోస్టర్‌లో రోషన్, మానస ఫెస్టివల్ వైబ్‌తో రొమాంటిక్‌గా (Bubblegum Romantic Pic) కనిపిస్తున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా వుంది. స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి వండర్ ఫుల్ ఆల్బమ్‌ని కంపోజ్ చేశారని.. పాటలన్నీ ప్రేక్షకులని అలరించేలా ఉండబోతున్నాయని మేకర్స్ వెల్లడించారు.


Roshan.jpg

దర్శకుడు రవికాంత్ పేరెపు న్యూ ఏజ్ యూనిక్ కథని ఎంచుకున్నారు. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. సురేష్ రగుతు డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి నిషాద్ యూసుఫ్ ఎడిటర్. శివమ్ రావు ప్రొడక్షన్ డిజైనర్. 2023 డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Bubblegum Movie)


ఇవి కూడా చదవండి:

============================

*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?

**********************************

*Saripodhaa Sanivaaram: శనివారం వరకు ఎందుకుని.. మంగళవారమే క్లాప్ కొట్టేశారు

************************************

*Devil: ‘డెవిల్’ స్టన్నింగ్‌ పోస్టర్‌.. సీక్రెట్‌ ఏజెంట్‌ ఏం ఉన్నాడులే..

**********************************************

Updated Date - 2023-10-25T10:21:22+05:30 IST