Natural Star Nani: రాజ‌మౌళి ఫ్యామిలీలో యాక్టర్స్‌లేని కొరత అతను తీర్చేశాడు

ABN , First Publish Date - 2023-08-11T16:14:05+05:30 IST

‘రాజ‌మౌళి అండ్ టీమ్ కొత్త, పాత అని సంబంధం లేకుండా అంద‌రినీ ఎంక‌రేజ్ చేస్తుంటారు. నా సినిమాల విష‌యంలో వారెలా స్పందిస్తారోన‌ని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంటాను’ అని అన్నారు న్యాచురల్ స్టార్ నాని. రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరోగా దూసుకెళుతున్న శ్రీ సింహ నటించిన ‘ఉస్తాద్’ ప్రీ రిలీజ్ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Natural Star Nani: రాజ‌మౌళి ఫ్యామిలీలో యాక్టర్స్‌లేని కొరత అతను తీర్చేశాడు
Natural Star Nani

‘రాజ‌మౌళి అండ్ టీమ్ కొత్త, పాత అని సంబంధం లేకుండా అంద‌రినీ ఎంక‌రేజ్ చేస్తుంటారు. నా సినిమాల విష‌యంలో వారెలా స్పందిస్తారోన‌ని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంటాను’ అని అన్నారు న్యాచురల్ స్టార్ నాని. బైక్ నేపథ్యంలో యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri) హీరోగా న‌టించిన చిత్రం ‘ఉస్తాద్’ (Ustaad). కావ్యా క‌ళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) హీరోయిన్‌‌గా నటించింది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, నేచుర‌ల్ స్టార్ నాని హాజరయ్యారు.


Rajamouli.jpg

ఈ కార్యక్రమంలో నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘‘రాజ‌మౌళి అండ్ టీమ్ కొత్త, పాత అని సంబంధం లేకుండా అంద‌రినీ ఎంక‌రేజ్ చేస్తుంటారు. నా సినిమాల విష‌యంలో వారెలా స్పందిస్తారోన‌ని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంటాను. సింహా విష‌యానికి వ‌స్తే త‌ను గ్రౌండ్ లెవ‌ల్లోనే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీనే అలా ఉంటుంది. రాజ‌మౌళి ఫ్యామిలీలో అంద‌రూ టెక్నీషియ‌న్సేనా.. యాక్ట‌ర్స్ లేరా? అని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సింహా రూపంలో యాక్ట‌ర్ కూడా వ‌చ్చేస్తున్నాడు. త‌ను కూడా టాప్ పొజిష‌న్‌లో నిలుస్తాడు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ మంచి కంటెంట్‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. మ‌న అని అనుకునే హీరోయిన్స్‌లో త‌ను కూడా నిలుస్తుంది. ‘ఉస్తాద్’ అనే పేరులోనే ప‌వ‌ర్ ఉంది. ట్రైల‌ర్‌లో ఎన‌ర్జీ చాలా బాగుంది. ‘ఉస్తాద్’ పాజిటివ్ వైబ్స్‌తో ఆగ‌స్ట్ 12న రిలీజ్ అవుతుంది. శ్రీసింహా కెరీర్‌లో మెమొర‌బుల్ మూవీగా ఈ మూవీ ఉంటుందని న‌మ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. (Nani Speech at Ustaad Pre Release Event)


ఇవి కూడా చదవండి:

***************************************

*Renu Desai: రేణు దేశాయ్ విజ్ఞప్తిపై అంబటి రియాక్షన్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!

***************************************

*SS Rajamouli: అందుకే యూత్‌కు న‌చ్చుతుంది

***************************************

*Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..

***************************************

*Bholaa Shankar Twitter Talk: ‘భోళా శంకర్’ బొమ్మ పరిస్థితి ఏంటో తెలిసిపోయింది..

***************************************

Updated Date - 2023-08-11T16:15:31+05:30 IST