National Film Awards 2023: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఆనందానికి అవధుల్లేవ్..

ABN , First Publish Date - 2023-08-24T22:02:30+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం, అందులోనూ మేము నిర్మించిన ‘పుష్ప’ చిత్రానికి ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా వుందని.. ఇది చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్. అలాగే ‘ఉప్పెన’ చిత్రం, దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డులు రావడం పట్ల కూడా తమ ఆనందాన్ని వారు తెలియజేశారు.

National Film Awards 2023: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఆనందానికి అవధుల్లేవ్..
Buchi Babu Sana with Mythri Movie Makers Producers

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం, అందులోనూ మేము నిర్మించిన ‘పుష్ప’ (Pushpa) చిత్రానికి ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా వుందని.. ఇది చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు నవీన్ యెర్నేని (Naveen Yerneni), వై రవిశంకర్ (Y Ravi Shankar). అలాగే ‘ఉప్పెన’ చిత్రం, దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డులు రావడం పట్ల కూడా తమ ఆనందాన్ని వారు తెలియజేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘పుష్ప: ది రైజ్‌’, ‘ఉప్పెన’ చిత్రాలు 2021 సంవత్సరానికి గానూ మూడు జాతీయ అవార్డులని కైవశం చేసుకున్నాయి. ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు‌గానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) సొంతం చేసుకున్నారు. జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. అలాగే ‘పుష్ప’ చిత్రానికి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు. అలాగే జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ (Uppena) చిత్రం అవార్డ్‌ని కైవశం చేసుకుంది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించి తమ ఆనందాన్ని తెలియజేశారు.


ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఐకాన్ స్టార్‌కి జాతీయ అవార్డ్ రావడం మాకు ఎంతో అనందంగా, గర్వంగా వుంది. పుష్ప సినిమా షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్ అనేవారు. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్‌గారికి, సుకుమార్‌గారికి కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌గారికి జాతీయ అవార్డ్ రావడం అనందంగా వుంది. పుష్ప మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేవిశ్రీ మాకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే ఉప్పెన సినిమాకి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డ్ రావడం గర్వంగా వుంది. దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్ కృతి శెట్టి, విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్, టీం అందరికీ అభినందనలు. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపుగా ఆరు అవార్డులు రావడం సంతోషంగా వుంది. జాతీయ అవార్డు విజేతలు అందరికీ పేరుపేరునా అభినందనలు అని తెలిపారు.

వై రవిశంకర్ మాట్లాడుతూ.. పుష్ప, ఉప్పెన మా బ్యానర్‌లో చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. రెండు చిత్రాలు కమర్షియల్‌గా హిట్ కావాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. చిరంజీవి‌గారు మొదట ‘ఉప్పెన’ కథ విని బావుందని చెప్పి ఎంతో ప్రోత్సహించారు. బుచ్చిబాబు సానా అద్భుతంగా తీశారు. 70 ఏళ్ల చరిత్రలో జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా పుష్పతో అల్లు అర్జున్ గారు చరిత్ర సృష్టించారు. మాకే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌గారు ఉప్పెన, పుష్ప రెండు చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు పుష్ప ద్వారా దేవిశ్రీ ప్రసాద్ గారికి అవార్డ్ రావడం అనందంగా వుంది. ఉప్పెన, పుష్ప ఈ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్ గారిదే. ఇక ఆర్ఆర్ఆర్, కొండపొలం చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. జాతీయ అవార్డులు పొందిన అందరికి పేరుపేరునా అభినందనలు అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Allu Arjun: బన్నీ ఇంట్లో ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన పుష్పరాజ్

***************************************

*Allu Arjun: జాతీయ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు నటుడు

***************************************

*Bhagavanth Kesari: మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బాలయ్య ‘భగవంత్ కేసరి’.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

***************************************

*Sathyaraj: సూపర్‌స్టార్‌ అంటే రజనీనే.. ఆ వార్‌కి చెక్

***************************************

*Sukanya: ఐదు పదుల వయసులో మరో పెళ్లా? నటి సుకన్య షాకైన వేళ..

***************************************

Updated Date - 2023-08-24T22:04:23+05:30 IST