Kriti Sanon: ప్రభాస్‌తో లవ్ ఎఫైర్‌పై స్పందించిన నటి.. ఆ హీరో చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డా..

ABN , First Publish Date - 2023-03-09T15:23:30+05:30 IST

మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). ‘వన్: నేనొక్కడినే’ తో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. ఈ మూవీ చేస్తున్నప్పుడే బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ రావడంతో ముంబైలోనే స్థిరపడిపోయింది.

Kriti Sanon: ప్రభాస్‌తో లవ్ ఎఫైర్‌పై స్పందించిన నటి.. ఆ హీరో చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డా..

మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). ‘వన్: నేనొక్కడినే’ తో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. ఈ మూవీ చేస్తున్నప్పుడే బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ రావడంతో ముంబైలోనే స్థిరపడిపోయింది. అనంతరం ‘లుకా చప్పీ’, ‘మిమి’ వంటి చిత్రాలతో తనలో మంచి నటి ఉందని నిరూపించుకుంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో కృతి ప్రేమాయణం కొనసాగిస్తుందని గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఈ వదంతులపై కృతి సనన్ కూడా అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి ఈ వార్తలపై ఆమె స్పందించింది.

వరుణ్ ధావన్ (Varun Dhawan), కృతి సనన్ కలసి ‘భేడియా’ (Bhediya) లో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో, హీరోయిన్ ఓ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ రియాలిటీ షోలో వరుణ్ ధావన్ ‘‘కృతి సనన్ మరొకరి గుండెల్లో ఉంది. ప్రస్తుతం ఆయన ముంబైలో లేరు. దీపికా పదుకొణె‌తో వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నారంటూ వదంతులు షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. అనంతరం ఆ వార్తలను పొడుగుకాళ్ల సుందరి ఖండించింది. తనకు ప్రభాస్ మంచి స్నేహితుడు మాత్రమేనని వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. అందులో భాగంగా జరిగిన ఘటనల గురించి వివరించింది. ‘‘వరుణ్ ఆ విధంగా చెప్పినప్పుడు నాకు బాధేసింది. ప్రభాస్‌‌కు ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడాను. అప్పడు ప్రభాస్..‘వరుణ్ ఎందుకు ఆ విధంగా చెప్పాడు..?’ అని ప్రశ్నించాడు. నాకు తెలియదు వరుణ్ పిచ్చిగా ప్రవర్తించాడు అని జవాబిచ్చాను’’ అని కృతి సనన్ తెలిపింది.

ప్రభాస్, కృతి సనన్ ‘ఆదిపురుష్’ (Adipurush )లో నటించారు. ఈ సినిమా రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతుంది. ప్రభాస్, కృతి ఈ చిత్రంలో రాముడి, సీత పాత్రలను పోషించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టీ-సిరీస్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ‘ఆదిపురుష్’ ను ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-09T15:29:13+05:30 IST