Yendira Ee Panchayithi: ‘ఈ పంచాయితీ’కి కోన వెంకట్ పాత్ర ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-01T20:56:17+05:30 IST

విలేజ్ లవ్ స్టోరీగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే టైటిల్‌తో రాబోతోన్న చిత్రాన్ని ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ని రచయిత కోన వెంకట్ చేతుల మీదగా మేకర్స్ విడుదల చేశారు.

Yendira Ee Panchayithi: ‘ఈ పంచాయితీ’కి కోన వెంకట్ పాత్ర ఏంటంటే..
Yendira Ee Panchayithi Movie Song Launch

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే లవ్ స్టోరీలు ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ను ఇస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలే వస్తున్నాయి.. పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఇప్పుడలాంటి తరహా చిత్రమే ఒకటి రాబోతోంది. ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayithi) అనే టైటిల్‌తో.. విలేజ్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రచయిత కోన వెంకట్ (Kona Venkat) చేతుల మీదుగా విడుదల చేశారు.


‘ఏమో ఏమో’ (Yemo Yemo Lyrical Video) అంటూ సాగే ఈ పాటకు పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీలు సమకూర్చగా.. అనురాగ్ కులకర్ణి గాత్రం, సతీష్ మాసం విజువల్స్ అందించారు. ఈ మెలోడీ సాంగ్‌కు సంగీత దర్శకుడు పీఆర్ సాహిత్యాన్ని అందించారు. పాటను విడుదల చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది. కొత్త వాళ్లైనా చక్కగా నటించారు. హీరో హీరోయిన్ల జంట బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Kona-Venkat-2.jpg

కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సతీష్ మాసం సినిమాటోగ్రఫీ, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీతం, జేపీ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. (Yemo Yemo Song From Yendira Ee Panchayithi Out)


ఇవి కూడా చదవండి:

============================

*Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

*************************************

*Shiva Nirvana: క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు

**************************************

*Pawan Kalyan: సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మూవీ.. ఆఫీస్ ప్రారంభమైంది

***********************************

*Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

***********************************

*Khushi film review: విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

***********************************

Updated Date - 2023-09-01T20:56:17+05:30 IST