Kiran Abbavaram: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా.. ‘మీటర్’ మ్యాటరిదే!

ABN , First Publish Date - 2023-03-01T18:15:13+05:30 IST

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. యంగ్ హీరోలలో బాగా వినిపిస్తున్న పేరిది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న కిరణ్‌ అబ్బవరం.. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రంతో

Kiran Abbavaram: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా.. ‘మీటర్’ మ్యాటరిదే!
Kiran Abbavaram In Meter Movie

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. యంగ్ హీరోలలో బాగా వినిపిస్తున్న పేరిది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న కిరణ్‌ అబ్బవరం.. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రంతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయానికి ట్విట్టర్ వేదికగా తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుకున్నాడు. అలాగే.. తర్వాత చేయబోయే సినిమా అప్‌డేట్ అతి త్వరలో అంటూ అలా హింట్ ఇచ్చాడో లేదో.. ఇలా అప్‌డేట్ వచ్చేసింది. ఈ యువ హీరో నటిస్తున్న తదుపరి చిత్రం.. పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’ (Meter).

టాలీవుడ్‌‌లో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (Clap Entertainment) పతాకంపై చిరంజీవి (చెర్రి) (Cherry), హేమలత పెదమల్లు (Hemalatha Pedamallu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి (Ramesh Kaduri) ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. (Meter Release Date)

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. కిరణ్‌ అబ్బవరంతో నిర్మిస్తున్న పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్‌, పాత్ర అన్ని కొత్తగా వుంటాయి. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్‌ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నామని తెలిపారు. కాగా.. కిరణ్ అబ్బవరం సరసన అతుల్య రవి (Sai Kartheek) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

*********************************

Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

* Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..

* Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

* Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

* Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

* Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

* Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

* Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

Updated Date - 2023-03-01T18:17:44+05:30 IST