కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jorugaa Husharugaa: విరాజ్ అశ్విన్‌ ‘జోరుగా హుషారుగా’ టీజర్ విడుదల

ABN, First Publish Date - 2023-10-21T22:07:50+05:30

‘బేబి’ చిత్రంతో నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న విరాజ్ అశ్విన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనుప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Jorugaa Husharugaa: విరాజ్ అశ్విన్‌ ‘జోరుగా హుషారుగా’ టీజర్ విడుదల
Jorugaa Husharugaa Movie Stills

‘బేబి’ చిత్రంతో నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న విరాజ్ అశ్విన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ (Jorugaa Husharugaa). పూజిత పొన్నాడ (Poojitha Ponnada) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనుప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కృష్ణ చైతన్య.. సీనియర్ పాత్రికేయులు మూర్తి, వినాయకరావు, సురేష్ కొండేటి‌లు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా హీరోహీరోయిన్ల జోడీ ముచ్చటగా వుంది. టీజర్ ఇంప్రెసివ్‌గా వుంది. తప్పకుండా చిత్రం కూడా జనాదరణ పొందాలని ఆశిస్తున్నానని అన్నారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇదొక జెన్యూన్ లవ్ ఎంటర్‌టైనర్. మంచి సినిమాలకు నా సపోర్ట్ ఎప్పడూ వుంటుంది. ఈ చిత్రం చూశాను. అందుకే ఈ చిత్ర విడుదలకు నా వంతు సహకారం అందిస్తున్నాను. దర్శకుడు అనుప్రసాద్ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించాడు. చిత్రంలో వుండే ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అందిరినీ అలరిస్తుంది. సినిమా కూడా విజయం సాధించాల‌ని కోరుకుంటున్నానని అన్నారు. (Jorugaa Husharugaa Teaser Launched)


Jorugaa Husharugaa.jpg

దర్శకుడు అనుప్రసాద్ (Anu Prasad) మాట్లాడుతూ.. నేటి యువ‌త‌రానికి న‌చ్చే అంశాల‌తో, అన్ని ఎమోష‌న్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం.. కొత్త‌ద‌నం ఆశించే అంద‌రికీ న‌చ్చుతుంది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అని తెలిపారు. దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. దర్శకుడు అనుప్రసాద్ నాకు స్నేహితుడు, మంచి ప్రతిభావంతుడు. టీజర్‌తో పాటు సంభాషణలు కూడా హృదయానికి హత్తుకున్నాయి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

============================

*Poonam Kaur: నేను కూడా ‘జై బాలయ్య’ బ్యాచ్‌లోకి చేరాలనుకుంటున్నా..

********************************************

*Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..

*************************************

*Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

**************************************

*Vishal: విశాల్‌ ఎఫెక్ట్‌.. ఆ చిత్రాల సెన్సార్‌ నిబంధనలలో మార్పు!

************************************

*Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..

******************************************

Updated Date - 2023-10-21T22:07:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!