Rama Banam: ‘రామబాణం’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. టార్గెట్ హ్యాట్రిక్

ABN , First Publish Date - 2023-03-04T17:39:43+05:30 IST

మాచో స్టార్ గోపీచంద్ (Macho Star Gopichand), డైరెక్టర్ శ్రీవాస్‌ (Director Sriwass) కాంబినేషన్‌లో గతంలో ‘లక్ష్యం’ (Lakshyam), ‘లౌక్యం’ (Loukyam) వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్‌లో

Rama Banam: ‘రామబాణం’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. టార్గెట్ హ్యాట్రిక్
Gopichand In Rama Banam

మాచో స్టార్ గోపీచంద్ (Macho Star Gopichand), డైరెక్టర్ శ్రీవాస్‌ (Director Sriwass) కాంబినేషన్‌లో గతంలో ‘లక్ష్యం’ (Lakshyam), ‘లౌక్యం’ (Loukyam) వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామబాణం’ (Rama Banam). టార్గెట్ హ్యాట్రిక్ హిట్‌గా (Hattrick) రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి (Dimple Hayathi) నటిస్తుండగా.. జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. మే 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుపుతూ.. ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. (Rama Banam Release Date)

‘‘బాగా చదవండి, పరీక్షలు ఇంకా బాగా రాయండి.. వేసవి సెలవుల్లో కలుద్దాం’’ అంటూ ఓ పవర్‌ఫుల్ ఆయుధం పట్టుకుని గోపీచంద్ సీరియస్‌గా చూస్తున్న ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో విక్కీ అనే పాత్రలో గోపీచంద్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘విక్కీస్ ఫస్ట్ యారో’ అనే ప్రత్యేక వీడియో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో గోపీచంద్ స్క్రీన్ ప్రజెన్స్, శ్రీవాస్ టేకింగ్, మిక్కీ జే మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. విద్యార్థులందరికీ పరీక్షలు ముగిశాక వేసవిలో మిమ్మల్ని అలరించటానికి, అసలుసిసలు వినోదాన్ని పంచడానికి రామబాణం దూసుకొస్తోందని.. మేకర్స్ ఇచ్చిన మెసేజ్ చూస్తుంటే.. సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందనేది అర్థమవుతోంది. (Rama Banam Movie)

గోపీచంద్ 30 (Gopichand30)వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలను మించేలా ఉండాలని శ్రీవాస్ (Sriwass) ప్రత్యేక శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. ప్రముఖ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులతో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి భూపతి రాజా (Bhupathi Raja) కథని అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

Updated Date - 2023-03-04T17:39:44+05:30 IST