Breaking: మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-02-27T22:32:02+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో..

Breaking: మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం
Chiranjeevi Movie Set

హైదరాబాద్‌ (Hyderabad) లోని కోకాపేట (Kokapet) లేక్ వద్ద 2022లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘ఆచార్య’ (Acharya) సినిమా కోసం ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ సెట్ అలాగే ఉండడంతో.. తాజాగా ఆ సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నట్లుగా తెలుస్తోంది. ‘ఆచార్య’ చిత్రం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కీలక పాత్రలో కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో ‘భోళా శంకర్’ (Bholaa Shankar) అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

‘భోళా శంకర్’ సినిమా విషయానికి వస్తే.. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిరంజీవి సరసన డాజ్లింగ్ బ్యూటీ తమన్నా (Tamanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘మహానటి’ కీర్తి సురేష్ (Keerthi Suresh).. చిరంజీవి సిస్టర్‌గా కనిపించనుంది. రీసెంట్‌గా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఓ మోషన్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఇందులో చిరంజీవి ఫెరోషియస్‌గా కనిపించారు. చేతిలో ఢమరుకం పట్టుకుని నటరాజ నాట్యం చేస్తున్నట్లు కనిపించారు. ఆ లుక్ చూసిన వారంతా శివుడు శివతాండవం చేస్తున్నట్టుగా ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

*********************************

Laya: పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన లయ

Krishnam Raju’s Wife: ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-27T22:32:04+05:30 IST