Sanjosh: పక్కింటి అబ్బాయిలా.. ‘బేవర్స్’ హీరో

ABN , First Publish Date - 2023-07-13T20:15:54+05:30 IST

‘బేవర్స్’ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Sanjosh: పక్కింటి అబ్బాయిలా.. ‘బేవర్స్’ హీరో
Hero Sanjosh

‘బేవర్స్’ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఆయన కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంజోష్ బర్త్‌డే‌ని పురస్కరించుకుని గురువారం చిత్రయూనిట్ ప్రత్యేకంగా విషెశ్ చెబుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సంజోష్ కూల్‌గా.. పక్కింటి అబ్బాయిలా చాలా న్యాచురల్‌గా కనిపిస్తున్నాడు.


ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. మూవీ షూటింగ్ పూర్తయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను, విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..

**************************************

*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను త‌న‌తో ఒకే మాట చెప్పా..

**************************************

*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?

**************************************

*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

**************************************

*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

**************************************

*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..

**************************************

Updated Date - 2023-07-13T20:43:55+05:30 IST