Atharva: మ్యూజిక్ డైరెక్టర్ బర్త్‌డే స్పెషల్‌గా.. పాటతో వచ్చిన ‘అథర్వ’

ABN , First Publish Date - 2023-05-15T21:03:04+05:30 IST

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌ చిత్రాలకు రొమాంటిక్, లవ్ ట్రాక్ సాంగ్స్ ఎక్కువగా ఉండవు. కానీ ‘అథర్వ’ చిత్రం అన్ని రకాల ఎమోషన్స్, సాంగ్స్‌తో స్పెషల్‌గా ఉండబోతుందని..

Atharva: మ్యూజిక్ డైరెక్టర్ బర్త్‌డే స్పెషల్‌గా.. పాటతో వచ్చిన ‘అథర్వ’
Atharva Movie Poster

కార్తీక్ రాజు (Karthik Raju), సిమ్రాన్ చౌదరి (Simran Chowdary), ఐరా (Ira) హీరోహీరోయిన్లుగా నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి (Mahesh Reddy) దర్శకత్వంలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘అథర్వ’. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ బర్త్‌డే స్పెషల్‌గా యూనిట్ ఓ పాటను గ్రాండ్‌గా విడుదల చేసింది. మాములుగా అయితే.. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌ చిత్రాలకు రొమాంటిక్, లవ్ ట్రాక్ సాంగ్స్ ఎక్కువగా ఉండవు. కానీ ‘అథర్వ’ చిత్రం అన్ని రకాల ఎమోషన్స్, సాంగ్స్‌తో స్పెషల్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్‌ పాకాల (Sricharan Pakala) పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను’ (Ringa Ringa Rosey.. Pilla Ninnu) అనే లిరికల్ వీడియో సాంగ్ కూడా మంచి ఆదరణను చూరగొంటోంది. శ్రీచరణ్‌ పాకాల బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, జావెద్ అలీ గాత్రంతో పాటు డ్యాన్స్ మాస్టర్ రాజ్ కృష్ణ కొరియోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి.

పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ (Director About Atharva).. ఇప్పటికే మేము విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్‌లోనే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని తెలియజేశాం. హీరో చిన్నతనం నుండి హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేక పోతాడు. అలా తన ఫీలింగ్‌ను సినిమాలో ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ పాట ఆ సన్నివేశానికి సరిగ్గా సరిపోతుందని ఎంచుకున్నాం. శ్రీ చరణ్ ఈ పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తనకు జన్మదిన శుభాకాంక్షలు. మేం అడిగిన వెంటనే లిరిక్ రైటర్ మంచి పాట రాశాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని తెలియజేశారు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చిందని నిర్మాత సుభాష్ అన్నారు.

హీరో కార్తీక్ మాట్లాడుతూ.. ‘కౌసల్య కృష్ణమూర్తి’ (Kousalya Krishna Murthy) సినిమా ద్వారా నన్ను వెలుగులోకి తీసుకువచ్చిన భీమనేని శ్రీనివాస్ రావుగారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఈ సాంగ్ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు సినిమాను చాలా బాగా తీశాడు. నిర్మాత సుభాష్ (Subhash) కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చడమే కాకుండా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారని అన్నారు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. నేను డ్యాన్సర్ అయినా నాకు ఇందులో ఒక్క స్టెప్ వేసే అవకాశం కూడా రాలేదు. టీం అంతా కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇలాంటి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. నా కో స్టార్ కార్తీక్ చాలా హానెస్ట్ పర్సన్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు విడుదల చేసిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!

*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

*Spy Teaser: ‘కార్తికేయ 2’ని మించి.. నిఖిల్ మరో సాహసం చేస్తున్నాడు

*AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం

*Pic Talk: రారా కృష్ణయ్యా.. రారా కృష్ణయ్యా..

*Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

*Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

Updated Date - 2023-05-15T21:03:49+05:30 IST