Shashtipoorthi: ‘లేడీస్ టైలర్’ జంట ‘షష్టిపూర్తి’ ఎంత వరకు వచ్చిందంటే..

ABN , First Publish Date - 2023-11-28T14:05:22+05:30 IST

రూపేష్ కథానాయకుడిగా MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘షష్టిపూర్తి’. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 37 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని అనిల్ రావిపూడి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Shashtipoorthi: ‘లేడీస్ టైలర్’ జంట ‘షష్టిపూర్తి’ ఎంత వరకు వచ్చిందంటే..
Shashtipoorthi Movie Still

రూపేష్ (Rupesh) కథానాయకుడిగా MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi). రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ (Ladies Tailor) విడుదలైన 37 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్ష సింగ్ (Akanksha Singh) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పవన్ ప్రభ (Pavan Prabha) దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తి అయినట్లుగా మేకర్స్ తెలిపారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ విడుదల అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. లుక్ చాలా బావుందని, దర్శకుడు పవన్ ప్రభకు ఇది తొలి చిత్రమైనప్పటికీ చక్కగా డిజైన్ చేశారని, సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Shashtipoorthi.jpg

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘‘పిల్లలు ఎవరైనా తమ తల్లిదండ్రుల పెళ్లి చూడలేరు. షష్టిపూర్తి ద్వారా ఆ లోటు తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. ఆ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. కొంత టాకీ, ఇంపార్టెంట్ యాక్షన్ సీన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఆ యాక్షన్ సీన్ కోసం మా హీరో రూపేష్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు కలిసి నటిస్తున్న చిత్రమిది. వారిద్దరూ ఇందులో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఓ రెట్రో ఎపిసోడ్ కూడా వాళ్లపై తీశాం. వాళ్ళిద్దరూ 30 ఏళ్ళ క్రితం ఎలా ఉండేవారో ఆ సీన్‌లో అలా ఉంటారు. యానాం సమీపంలోని తాతపూడిలో తీశాం. సినిమాలో మొత్తం 80 లొకేషన్లు ఉన్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం చిత్రీకరణ జరిగింది. గోదావరి హృదయాన్ని, అక్కడ అందాన్ని ఆవిష్కరించే ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. ఒక పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి చిత్రీకరించాం. మిగతా పాటలను గోదావరి ప్రాంతంలో తీశాం. సినిమాలో మంచి మ్యూజికల్ జర్నీ ఉంటుంది. అందుకని, ఇసైజ్ఞాని ఇళయరాజా గారిని తీసుకున్నాం. బలమైన భావోద్వేగాలను ఆవిష్కరించడానికి ఆయన అయితే న్యాయం చేస్తారని మా నమ్మకం’’ అని చెప్పారు. (Shashtipoorthi First Look Motion Poster Out)


Rupesh.jpg

సినిమా హీరో, నిర్మాత రూపేష్ మాట్లాడుతూ.. కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన వంటి సీనియర్ హీరో హీరోయిన్లతో నటించడం లెర్నింగ్ ప్రాసెస్ అండ్ బ్లెస్సింగ్! కథ విన్న వెంటనే మా సంస్థలో నిర్మించాలని నిర్ణయించుకున్నా. ఉన్నత సాంకేతిక విలువలతో రాజీ పడకుండా ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని మా ప్రయత్నం. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (Maestro Ilayaraaja) గారితో పాటు కళా దర్శకుడు తోట తరణి (Thota Tarani) వంటి మహామహులతో సినిమా చేయడం కోసం ఏడాది పాటు కృషి చేశాం. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

====================

*Rashmika Mandanna: గర్ల్ ఫ్రెండ్‌గా రష్మిక మందన్నా.. క్లాప్ కొట్టేశారు

**********************************

*Gangs of Godavari: విశ్వక్ సేన్ సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

**********************************

*డైరెక్టర్ క్రిష్ వదిలిన ‘మహేంద్రగిరి వారాహి’ గ్లిమ్స్

***********************************

Updated Date - 2023-11-28T14:05:25+05:30 IST