డైరెక్టర్ క్రిష్ వదిలిన ‘మహేంద్రగిరి వారాహి’ గ్లిమ్స్

ABN , First Publish Date - 2023-11-27T20:50:32+05:30 IST

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 సినిమాకు ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర గ్లిమ్స్‌ను తాజాగా దర్శకుడు క్రిష్ విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

డైరెక్టర్ క్రిష్ వదిలిన ‘మహేంద్రగిరి వారాహి’ గ్లిమ్స్
Sumanth in Mahendragiri Varahi Movie

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 సినిమాకు ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర గ్లిమ్స్‌ను తాజాగా దర్శకుడు క్రిష్ (Director Krish) విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉందని ట్విట్టర్ వేదికగా టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా పోస్ట్ చేశారు.

గ్లింప్స్ విడుదల అనంతరం దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. మహేంద్రగిరి వారాహి టైటిల్ చాలా బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యే కథ కథనాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్ర గ్లిమ్స్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.


Sumantha-Pic.jpg

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ (Santhossh Jagarlapudi) తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. సుమంత్ (Sumantha), మీనాక్షి గోసామి (Meenakshi Gosami), వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు కథను మురళీధర్ అందిస్తున్నారు.

Updated Date - 2023-11-27T20:50:34+05:30 IST