Rashmika Mandanna: గర్ల్ ఫ్రెండ్‌గా రష్మిక మందన్నా.. క్లాప్ కొట్టేశారు

ABN , First Publish Date - 2023-11-28T13:30:07+05:30 IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించబోతోన్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది. అనౌన్స్‌మెంటే ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ సినిమాని మేకర్స్ ప్రారంభించారు.

Rashmika Mandanna: గర్ల్ ఫ్రెండ్‌గా రష్మిక మందన్నా.. క్లాప్ కొట్టేశారు
Rashmika Mandanna

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించబోతోన్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది. అనౌన్స్‌మెంటే ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ (Geetha Arts), మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ‘చి.ల.సౌ, మన్మథుడు 2’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తెరకెక్కిస్తున్నారు. విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.


Allu-Aravind.jpg

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో లాంఛనంగా ఈ సినిమాని మేకర్స్ ప్రారంభించారు. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మారుతి (Director Maruthi) కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘బేబి’ సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. మేకర్స్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రజంట్ ట్రెండ్‌కి కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని, సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Gangs of Godavari: విశ్వక్ సేన్ సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

**********************************

*డైరెక్టర్ క్రిష్ వదిలిన ‘మహేంద్రగిరి వారాహి’ గ్లిమ్స్

***********************************

Updated Date - 2023-11-28T13:30:09+05:30 IST