సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Amala Akkineni on Stray dog: ‘ఒక మనిషి హంతకుడైతే మానవత్వం చనిపోయినట్లేనా?.. మరి కుక్కల విషయంలో ఎందుకిలా..’

ABN, First Publish Date - 2023-03-01T14:27:00+05:30

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో బాలుడి మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వీధి కుక్కల దాడి (Stray dog Attack)తో అంబర్ పేటకి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి గురించి తెలిసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

Amala Akkineni
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో బాలుడి మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వీధి కుక్కల దాడి (Stray dog Attack)తో అంబర్ పేటకి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి గురించి తెలిసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. దీంతో ఈ దుర్ఘటనపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకూ ఎందరో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చాలామంది ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో జంతు ప్రేమికుల (Animal Lovers) స్పందన మాత్రం వేరేలా ఉంది.

యాంకర్ రష్మి (Rashmi) అయితే.. ‘కుక్కలు మనలాంటి ప్రాణులే. వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలి. టీకాలు వేయించి, వాటి జనాభాను నియంత్రిచాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శల పాలయ్యింది. తాజాగా ఈ ఘటనపై బ్లూక్రాస్‌ సోసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్వహకురాలు, నటి అమల అక్కినేని (Amala Akkineni) ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించినట్లు తెలుస్తోంది.

అమల మాట్లాడుతూ.. ‘50వేల సంవత్సరాల క్రితమే మనుషులకి, కుక్కలకి మధ్య బంధం ఏర్పడింది. అరుదుగా జరిగే ఇలాంటి ఘటన వల్ల కుక్కలు అన్నింటికి ప్రమాదం తలపెట్టకూడదు. టీకాల ద్వారా వాటి సంఖ్యను నియంత్రించడానికి అధికారులకి సహకరించండి. ఓ వ్యక్తి హంతకుడైనంతా మాత్రానా మానవత్వం మీద అనుమాన పడతామా. అలాగే ఒక్క కుక్క చేసిన పనికి ఆ జాతి మీదే కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. కుక్కలు మనుషులను ప్రేమిస్తాయనే విషయం గుర్తుంచుకోండి. మనం వాటికి ఆహారాన్ని ఇస్తే.. అవి మనల్ని రక్షిస్తాయి’ అని చెప్పినట్లు న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అమల స్పందిస్తే కానీ తెలియదు.

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-01T14:27:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!