OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-02-28T09:04:59+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఫిబ్రవరి 27న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)

‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ ట్రెసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. తమ్ముడి నిజాయతీని నిరూపించడానికి ఓ అన్న చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

chiranjeevi.jpg

ఇది కూడా చదవండి: OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

బికో (Biko)

ఇజ్వాన్ అనే ఒంటరి తండ్రి తన కొడుకుతో కలిసి జీవిస్తూ ఉంటాడు. అద్దె చెల్లించకపోవడం వల్ల ఓనర్ వారిని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఈ తరుణంలోనే సారా అనే పాపులర్ సింగర్ దగ్గరకి బికోని షెర్రీ స్నేహితుడు తీసుకెళతాడు. ఇంతకీ సారా ఎవరు?. ఆమె పరిచయం బికో జీవితాన్ని ఎన్ని మలుపులు తిరిగిందనేది ‘బికో’ కథాంశం. టెంగ్ బీ దర్శకత్వం వహించిన ఈ మలయ్ చిత్రంలో అజ్రెల్ ఇస్మాయిల్, బేబీ షిమా, సైద్ ఇర్ఫాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

biko.jpg

జీ5 (ZEE5)

PHD Pyaar Hai Drama - పంజాబీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus Hotstar)

Aashiqana Season 3 - హిందీ

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

The Blacklist Season 10 - ఇంగ్లిష్

The Gentlemen's League Season 2 - కొరియన్

Updated Date - 2023-02-28T09:05:00+05:30 IST