Varalaxmi Sarathkumar: ‘కోట బొమ్మాళి పీఎస్‌’ ఎలా ఉంటుందంటే..?

ABN , First Publish Date - 2023-11-17T22:16:06+05:30 IST

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించగా.. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతోన్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.

Varalaxmi Sarathkumar: ‘కోట బొమ్మాళి పీఎస్‌’ ఎలా ఉంటుందంటే..?
Varalaxmi Sarathkumar

రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) ప్రధాన పాత్రలలో నటించగా.. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ (Varalaxmi Sarathkumar) కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 (Geetha Arts 2) బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాకు చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. (Varalaxmi Sarathkumar Interview)

Vara-1.jpg

‘‘నేను ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. తమిళంలో పోలీస్ పాత్రలు చాలా చేశాను కానీ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నా. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తుంది. వాటిలో పోలీస్ ఆఫీసర్‌‌గానే కనిపించాలి. అయితే ప్రతి స్ర్కిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ‘కోట బొమ్మాళి పీఎస్‌’ కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా. నేను కథే హీరోగా భావిస్తా. ఇందులో శ్రీకాంత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, నేనొక పోలీస్ ఆఫీసర్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది.. పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ మూవీ కాన్సెప్ట్. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. (Varalaxmi Sarathkumar about Kota Bommali PS)


Vara-2.jpg

ఈ సినిమా స్క్రీన్‌‌ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైమ్‌లో రావడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇందులో ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ‘నాయట్టు’కి రీమేక్ అయినా.. దానికి దీనికి చాలా మార్పులు చేశారు. ఇందులో నా పాత్ర బాగా పెంచారు. ఈ చిత్రంలో నాకు స్మోకింగ్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చేయలేదు. అందుకే ఛాలెంజింగ్‌గా అనిపించింది. క్యారెక్టర్‌‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది. ఇందులో యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుంది.

పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ గురించి చూపించాం కానీ.. ఏ పార్టీకి సంబంధం ఉండదు. లింగిడి లింగిడి పాటకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు తేజ మార్ని (Teja Marni) చాలా క్వాలిటీగా ఈ సినిమాని తెరకెక్కించారు. మంచి క్యారెక్టర్స్ చేయడమే నా గోల్. వరలక్ష్మీ చాలా డిఫరెంట్‌గా చేసిందని ప్రేక్షకులు అనుకోవాలని ఎప్పుడూ భావిస్తుంటాను. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. సంక్రాంతికి నేను నటించిన ‘హనుమాన్‌’ విడుదలవుతోంది. కన్నడలో సుదీప్‌తో కలిసి ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నా. మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఉంటుంది..’’ అని వరలక్ష్మీ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

========================

*KR Vijaya: కెఆర్ విజయ @ 60

*****************************

*Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్

**************************

*Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల

*******************************

Updated Date - 2023-11-17T22:16:11+05:30 IST