Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్

ABN , First Publish Date - 2023-11-16T13:07:05+05:30 IST

ముంబై వేదికగా బుధవారం జరిగిన క్రికెట్ ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో శివతాండవం ఆడుతుంటే.. చూసి ఎంజాయ్ చేయడం అనుష్క శర్మ వంతైంది. ప్రపంచకప్ అనే కాదు.. గ్రౌండ్, మ్యాచ్ ఏదైనా సరే.. ఆ మ్యాచ్‌కి ఆమె హాజరై ఉంటే.. క్రీజులో కోహ్లీ పరుగుల వర్షం కురిపించినప్పుడల్లా.. అనుష్క శర్మ కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఆమె కోహ్లీని దేవుడి బిడ్డవు అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్
Kohli and Anushka Sharma

ఏ రంగంలోనైనా మన అనుకున్న వారికి సక్సెస్ వస్తే.. అందులో కలిగే ఆనందమే వేరు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగిరి గంతులేస్తాం. ప్రపంచాన్ని మర్చిపోయి, ఆ మధురానుభూతిని ఆస్వాదిస్తాం. ముంబై వేదికగా బుధవారం జరిగిన క్రికెట్ ప్రపంచకప్ (Cricket World Cup 2023) సెమీ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ (Viral Kohli) బ్యాట్‌తో శివతాండవం ఆడుతుంటే.. చూసి ఎంజాయ్ చేయడం అనుష్క శర్మ వంతైంది. ప్రపంచకప్ అనే కాదు.. గ్రౌండ్, మ్యాచ్ ఏదైనా సరే.. ఆ మ్యాచ్‌కి ఆమె హాజరై ఉంటే.. క్రీజులో కోహ్లీ పరుగుల వర్షం కురిపించినప్పుడల్లా.. అనుష్క శర్మ (Anushka Sharma) కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంటుంది. అతడు బంతిని బౌండరీకి పంపిస్తే చాలు.. ఆమె నుంచి వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది.

Cup.jpg

ఇక కోహ్లీ అర్థశతకం లేదా శతకం బాదేస్తే మాత్రం.. తాను మైదానంలో వేలాదిమంది మధ్యలో ఉన్నాననే సంగతి కూడా మర్చిపోయి, ఎంతో ఉత్సాహంతో ఆ సందర్భాన్ని ఆస్వాదిస్తుంటుంది. కెమెరాల ముందు ముద్దుల వర్షం (ఫ్లయింగ్ కిస్) కురిపించేస్తుంది. తాజాగా వాంఖడే స్టేడియంలోనూ అదే దృశ్యం రిపీట్ అయ్యింది. సెంచరీ అనంతరం కోహ్లీ, అనుష్క ఒకరికి ఒకరు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అయితే ఇంతటితో ఆగని అనుష్క శర్మ.. కోహ్లీపై తన మనసులో ఉన్న మాటను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నువ్వు దేవుడి బిడ్డవు..’ అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. (Anushka Sharma and Kohli)


Kohli.jpg

‘‘దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రైటర్. నీ ప్రేమ నాకు దక్కినందుకు, నీ ఎదుగులను చూసే అవకాశం నాకిచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మనసులోనూ, ఆటపై నిజాయితీగా ఉండే నువ్వు.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు’’ అంటూ అనుష్క శర్మ తన మనసులోని మాటను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది (Anushka Sharma Post on Kohli). తన భర్త విరాట్‌ పిక్‌తో పాటు సెమి ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి విజయానికి కారణమైన మహమ్మద్ షమీ (Man of the Match) ఫొటోలను, ప్రపంచకప్‌కు అడుగు దూరంలో ఉన్నట్లుగా వైరల్ అవుతోన్న టీమిండియా (Team India) సభ్యుల ఫొటోను కూడా అనుష్క శర్మ తన ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేసింది. (World Cup)

Shami.jpg


ఇవి కూడా చదవండి:

========================

*Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల

*******************************

*Namitha Husband: పోలీసుల విచారణకు హాజరుకాని నటి నమిత భర్త.. లేఖలో ఏం చెప్పారంటే?

********************************

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

*Mehreen Pirzada: అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్‌..

**********************************

Updated Date - 2023-11-16T13:07:06+05:30 IST