KR Vijaya: కేఆర్ విజయ @ 60

ABN , First Publish Date - 2023-11-17T17:33:16+05:30 IST

వెండితెరపై దేవత అనగానే గుర్తొచ్చే పేరు కె.ఆర్. విజయ. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ సీనియర్ నటి దాదాపు సౌత్‌లోని అన్ని భాషలలో నటించి గొప్ప కీర్తిని గడించడమే కాకుండా.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. కెఆర్ విజయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ నవంబర్‌తో ఆరు దశాబ్దాలు పూర్తయ్యాయి. దీంతో సౌత్ సినీ ప్రేమకులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

KR Vijaya: కేఆర్ విజయ @ 60
KR Vijaya

వెండితెరపై దేవత అనగానే గుర్తొచ్చే పేరు కె.ఆర్. విజయ (KR Vijaya). తమిళ చిత్ర పరిశ్రమకు (Kollywood) చెందిన ఈ సీనియర్ నటి దాదాపు సౌత్‌లోని అన్ని భాషలలో నటించి గొప్ప కీర్తిని గడించడమే కాకుండా.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. కెఆర్ విజయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ నవంబర్‌తో ఆరు దశాబ్దాలు పూర్తవుతున్నాయి. 1963 నవంబర్‌లో ‘కర్పగం’ అనే చిత్రం ద్వారా వెండితెరకు ఆమె పరిచయమైంది. ఆ చిత్రానికి దర్శకుడు కేఎస్ గోపాలకృష్ణన్ (KS Gopalakrishnan).

KR-Vijaya-2.jpg

విశేషం ఏమిటంటే.. తనని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు కేఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో కేఆర్ విజయ తన 100వ చిత్రం, అలాగే 200వ చిత్రం చేయడం. 100వ చిత్రం ‘సత్తైయిల్ ముత్తు’, 200వ చిత్రం ‘పడిక్కాద పన్నైయార్’ చిత్రాలకు కేఎస్ గోపాలకృష్ణే దర్శకుడు. ఆమె కెరీర్‌లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. మొదట్లో చెన్నై (Chennai) స్థానిక టీ నగర్‌లో నివసించిన ఆమె పతీవియోగం తర్వాత తన మకాంను కేరళ (Kerala)కు మార్చారు. ప్రస్తుతం ఆమె ‘మూత్తకుడి’, ‘రాయర్ పరంబరై’ చిత్రాలలో నటిస్తున్నారు. (K.R. Vijaya)


KR-Vijaya.jpg

కె.ఆర్. విజయ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ముఖ్యంగా బోయపాటి (Boyapati), బాలయ్య (Balayya) కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha) సినిమాలో బాలయ్యకు అమ్మమ్మగా ఆమె నటించింది. ఆ పాత్ర ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. చైతూ, తమన్నాల ‘100 పర్సంట్ లవ్’, ‘శ్రీరామరాజ్యం’ వంటి చిత్రాలలో నటించి నేటితరం ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆమె నటించిన భక్తి ప్రధాన చిత్రాలు.. ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా.. ఆమెను ఆరాధించేలా చేశాయి. ప్రస్తుతం ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Anushka Sharma: నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు.. కోహ్లీపై అనుష్క శర్మ పోస్ట్ వైరల్

**************************

*Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల

*******************************

*Namitha Husband: పోలీసుల విచారణకు హాజరుకాని నటి నమిత భర్త.. లేఖలో ఏం చెప్పారంటే?

********************************

Updated Date - 2023-11-17T18:09:43+05:30 IST