Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల

ABN , First Publish Date - 2023-11-16T12:32:55+05:30 IST

సుధీర్ బాబు నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) పతాకంపై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక శర్మను దేవిగా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.

Malvika Sharma: ‘హరోం హర’ నుండి ‘దేవి’ లుక్ విడుదల
Malvika Sharma in Harom Hara

‘పవర్ ఆఫ్ సుబ్రమణ్యం’ (Power Of Subramanyam) నవంబర్ 22న విడుదల కానుంది. అంతకంటే ముందు సుధీర్ బాబు (Sudheer Babu) పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’ (Harom Hara) మేకర్స్ ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) పతాకంపై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక శర్మ (Malvika Sharma)ను దేవి (Devi)గా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో మాళవిక చీరలో అందంగా, సాంప్రదాయకంగా ఆకట్టుకుంటోంది. ఆమె లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి చిరునవ్వుతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఇటీవలే ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. (Malvika Sharma First Look From Harom Hara)


Devi.jpg

చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతం సమకూరుస్తున్నారు. ది రివోల్ట్.. అనేది ‘హరోం హర’ ట్యాగ్ లైన్. ఇది సుధీర్ బాబు కెరీర్‌లో హై బడ్జెట్‌ మూవీగా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

========================

*Namitha Husband: పోలీసుల విచారణకు హాజరుకాని నటి నమిత భర్త.. లేఖలో ఏం చెప్పారంటే?

********************************

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

*Mehreen Pirzada: అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్‌..

**********************************

*Malavika Mohanan: అభిమానుల మనసుల్లో మాళవిక గిలిగింతలు

********************************

Updated Date - 2023-11-16T12:32:58+05:30 IST