Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్

ABN , Publish Date - Dec 23 , 2023 | 04:17 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్ వచ్చింది. తాజాగా మోహన్ బాబు తన ట్విట్టర్ ‘ఎక్స్’ అకౌంట్‌లో ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో.. విష్ణు మంచు టైటిల్‌ రోల్‌‌లో నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫారిన్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది.

Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్
Manchu Mohan Babu

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) నుండి ‘కన్నప్ప’ (Kannappa) అప్‌డేట్ వచ్చింది. తాజాగా మోహన్ బాబు తన ట్విట్టర్ ‘ఎక్స్’ అకౌంట్‌లో ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో.. విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్‌ రోల్‌‌లో నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన కన్నప్ప పోస్టర్‌ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇందులో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) హీరోయిన్‌గా నటిస్తోంది.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని.. ‘మహాభారతం’ సీరియల్ సృష్టి కర్త ముఖేష్ కుమార్ సింగ్ ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఆయన ఈ సినిమాను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నట్లుగా.. ఇప్పటికే మంచు విష్ణు తెలిపి ఉన్నారు. ప్రస్తుతం థాయిలాండ్ మరియు న్యూజిలాండ్‌లో చేయాల్సిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్లుగా మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు, భారతదేశానికి బయలు దేరినట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు. (Kannappa Update From Mohan Babu)


Kannappa.jpg

‘‘న్యూజిలాండ్‌లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం..’’ అని మంచు మోహన్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. (Mohan Babu Kannappa Tweet)


ఇవి కూడా చదవండి:

====================

*Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

*****************************

*Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్.. షరతులు ఏంటంటే?

********************************

*Sravanthi: జెమిని టీవీలో సరికొత్త సీరియల్.. ఎప్పటి నుంచంటే?

*******************************

*పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!

*********************************

Updated Date - Dec 23 , 2023 | 04:17 PM