Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

ABN , Publish Date - Dec 23 , 2023 | 03:37 PM

సింగిల్ క్యారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ప్రయోగమే టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం చేయబోతున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆదిత్య ఓం ‘బందీ’గా వస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్
Bandi Movie Still

సింగిల్ క్యారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ప్రయోగమే టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం (Aditya Om) చేయబోతున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు. ఈసారి ఆదిత్య ఓం ‘బందీ’ (Bandi) అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. గల్లీ సినిమా బ్యానర్‌పై ఈ మూవీని వెంకటేశ్వరరావు దగ్గు (DVR), తిరుమల రఘు (Raghu Tirumala) నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Aditya-Om.jpg

ఈ ట్రైలర్‌లో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఒక సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో చూపించారు. ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటారు. స్వేచ్చగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బంధీగా రూపొందించారు. ఇక ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించారు. చివరకు నగ్నంగా కనిపించే షాట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం. అందుకే ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్‌‌గా మారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. విశేషం ఏమిటంటే.. ఈ ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం. (Bandi Trailer Released)


Bandi.jpg

ఈ చిత్రానికి వీరల్, లవన్, సుదేష్ సావంత్ సంగీతాన్ని అందించగా.. మధుసూధన్ కోట సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేసినట్లుగానూ.. ఇందులో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేసినట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. మూడేళ్లు కష్టపడి ఏడాదిలో ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేసినట్లుగా వారు పేర్కొన్నారు. పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. (Bandi Movie Trailer Out)


ఇవి కూడా చదవండి:

====================

*Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్.. షరతులు ఏంటంటే?

********************************

*Sravanthi: జెమిని టీవీలో సరికొత్త సీరియల్.. ఎప్పటి నుంచంటే?

*******************************

*పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!

*********************************

Updated Date - Dec 23 , 2023 | 04:19 PM