Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

ABN , First Publish Date - 2023-04-08T16:06:37+05:30 IST

ఈ సినిమా కోసం నేను బంకమట్టిలా వెళ్ళి ఆయన ముందు నిల్చున్నాను. ఆయన ఏది చెబితే, ఎలా చెబితే అలా చేశాను. ఆయన చెప్పకముందే..

Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు
Vijay Sethupathi

దర్శకుడు వెట్రిమారన్‌ (VetriMaaran) ముందు బంకమట్టిగా వెళ్ళి నిల్చొంటే, ఆయన తనను వాత్తియార్‌గా తయారు చేశారని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు. గత నెల 31న విడుదలైన చిత్రం ‘విడుదలై’ (Viduthalai). వెట్రిమారన్‌ దర్శకత్వంలో హాస్య నటుడు సూరి (Soori) హీరోగా నటించగా, విజయ్‌ సేతుపతి ‘వాత్తియార్‌’ (Vathiyar) పాత్రలో కనిపించారు. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర బృందం థ్యాంక్స్‌ గివింగ్‌ మీట్‌ (Thanks Giving Meet)ను చెన్నైలో ఏర్పాటు చేశారు.

Also Read-Allu Arjun Birthday Special: గ్లోబల్ స్థాయికి దూసుకెళుతోన్న రేసుగుర్రం

ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. మేకింగ్‌ వీడియోలోనే దర్శకుడు పడిన కష్టం తెలిసింది. ఈ సినిమా కోసం నేను బంకమట్టిలా వెళ్ళి ఆయన ముందు నిల్చున్నాను. ఆయన ఏది చెబితే, ఎలా చెబితే అలా చేశాను. ఆయన చెప్పకముందే ఆయన హావభావాలను అర్థం చేసుకుని నటించా. భాష కంటే మూగసైగలే ముందు పుట్టాయి. ఇక్కడ నటించింది విజయ్‌ సేతుపతి కాదు. ఒక ‘వాత్తియార్‌’. వెట్రిమారన్‌ (Director VetriMaaran) నిజ జీవితంలో అనేక మంది వాత్తియార్లను తయారు చేశారు. వెట్రిమారన్‌కు జ్ఞానం అపారం. కార్యాచరణ గొప్పగా ఉంటుంది. ఈ కథలో అనేక సందేహాలు వచ్చాయి. వాటినన్నింటిని నివృత్తి చేసుకున్నాను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌కు కారణమైన దర్శకుడు, హీరో సూరి, పంపిణీ సంస్థ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌, చిత్ర యూనిట్‌ సభ్యులకు ధన్యవాదాలని అన్నారు. (Viduthalai Success Celebrations)

Vetrimaaran.jpg

అనంతరం దర్శకుడు వెట్రిమారన్‌ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాను తీయడం చాలా సులభం. కానీ, ఇలాంటి కథపై నమ్మకం పెట్టడం సులభమైన విషయం కాదు. నిర్మాతకు మంచి గుండె ధైర్యం కావాలి. ఈ సినిమాలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రేక్షకులు పక్కనబెట్టి... ఘన విజయాన్ని అందించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సక్సెస్‌ కావాలని ఆకాంక్షించిన మీడియాకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఇంకా హీరో సూర్య, నిర్మాత ఎల్రెడ్‌ కుమార్‌, హీరోయిన్‌ భావన తదిరులు ప్రసంగించారు. (Kollywood Film Viduthalai)

ఇవి కూడా చదవండి:

*********************************

*HappyBirthdayAlluArjun: బన్నీది ఎంత మంచి మనసంటే.. అంతమందిని చూసి లైట్ తీస్కోవడానికి మనసు రాక..

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

Updated Date - 2023-04-08T16:07:27+05:30 IST