HappyBirthdayAlluArjun: బన్నీది ఎంత మంచి మనసంటే.. అంతమందిని చూసి లైట్ తీస్కోవడానికి మనసు రాక..

ABN , First Publish Date - 2023-04-08T13:30:06+05:30 IST

అల్లు అర్జున్ పుట్టినరోజును (Allu Arjun Birthday) పురస్కరించుకుని.. ఆయన ఇంటి ముందు అభిమాన సంద్రం నెలకొంది. ఆయనని చూసేందుకు, పుట్టినరోజు శుభాకాంక్షలు (HBDIconStarAlluArjun) తెలిపేందుకు అభిమానులు భారీగా

HappyBirthdayAlluArjun: బన్నీది ఎంత మంచి మనసంటే.. అంతమందిని చూసి లైట్ తీస్కోవడానికి మనసు రాక..
Allu Arjun at His Residence

ఏ సినిమా ఇండస్ట్రీలో (Cinema Industry) అయినా, ఏ స్టార్ హీరో (Star Hero) అయినా ముందు నార్మల్ హీరోగానే ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. ఆ నార్మల్ హీరోని స్టార్‌ని చేసేది మాత్రం అభిమానులే. అందుకే హీరోలు ఎంత ఎదిగినా.. అందుకు కారణం వారి అభిమానులే అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంత అభిమానం చూపించే అభిమానుల కోసం ఇంకా కష్టపడాలని, మంచి మంచి సినిమాలు వారికి ఇవ్వాలని హీరోలు చూస్తుంటారు. ఈ మాట ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ చెప్పేమాటే. అభిమానులపై చేయి చేసుకున్నా, వారిని గట్టిగా హెచ్చరించినా అది అభిమానులపై ప్రేమ మాత్రమే. అభిమానులు హద్దు దాటకుండా ఉండాలనే అలా చేస్తుంటామని ఇటీవల ఓ హీరో పబ్లిగ్గా చెప్పారు. సరే ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు టాలీవుడ్ హీరోల క్రేజ్ (Tollywood Heroes Craze) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గ్లోబల్ రేంజ్‌లో టాలీవుడ్ హీరోలు చక్రం తిప్పుతున్నారు. (Happy Birthday AlluArjun)

Also Read-Allu Arjun Birthday Special: గ్లోబల్ స్థాయికి దూసుకెళుతోన్న రేసుగుర్రం

ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు (Bollywood Heroes) అమితాబ్ (Amitabh), షారుఖ్ (Shahrukh), సల్మాన్ (Salman Khan) వంటి వారి క్రేజ్ మాములుగా ఉండేది కాదు. ఇప్పుడు వారిని కూడా బీట్ చేసి టాలీవుడ్ హీరోలు తమ పవర్ చూపిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో బర్త్‌డే అంటే గ్లోబల్‌గా సందడి నెలకొంటుంది. బాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోల పుట్టినరోజున.. వారి ఇంటి ముందు అభిమానులు (Fans) ఎలా అయితే బారులు తీరుతారో.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల ఇంటి ముందు కూడా సేమ్ టు సేమ్ అదే కల్చర్ కనబడుతుంది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజును (Allu Arjun Birthday) పురస్కరించుకుని.. ఆయన ఇంటి ముందు అభిమాన సంద్రం నెలకొంది. ఆయనని చూసేందుకు, పుట్టినరోజు శుభాకాంక్షలు (HBDIconStarAlluArjun) తెలిపేందుకు అభిమానులు భారీగా తరలి రావడంతో.. ఆ వచ్చిన వారందరినీ బన్నీ ప్రేమగా పలకరించారు. ఇలా బన్నీ అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Allu-Family.jpg

అభిమానుల అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ (అల్లు అర్హ, అయాన్ కూడా).. ఇంటిలో నుంచి బయటికి వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అన్నా’ (Happy Birthday Anna) అంటూ ఫ్యాన్స్ అందరూ ఫ్యామిలీ సభ్యుల్లా శుభాకాంక్షలు తెలపడంతో.. బన్నీ ఎమోషనల్ అయ్యారు. ‘మీరు లేనిదే నేను లేను.. మీరే నా ఆర్మీ’ (Allu Army) అంటూ బన్నీ.. తన అభిమానుల కోసం చాలా సేపు టైమ్ స్పెండ్ చేశారు. ఇప్పుడీ వీడియోని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోని చూసిన వారంతా ‘గ్రేట్.. ఇంకో మెట్టెక్కేశావ్ పుష్ప’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

*********************************

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

*Shruti Haasan: అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో చేశా..

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

Updated Date - 2023-04-08T13:30:13+05:30 IST