కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Surya: డాడీతో పోలిక లేదు.. ఆ పేరు కూడా వాడుకోనంటోన్న విజయ్‌ సేతుపతి కుమారుడు

ABN, First Publish Date - 2023-11-25T15:40:36+05:30

కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి తనయుడు సూర్య వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నారు. ‘ఫీనిక్స్‌’ (వీళాన్‌) పేరుతో తెరకెక్కించే ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం చెన్నై నగరంలోని ఏవీఎం స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది. బ్రేవ్‌మేన్‌ పిక్చర్స్‌ పతాకంపై రాజలక్ష్మి అరసు కుమార్‌ నిర్మిస్తుండగా, ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ ‘అనల్‌’ అరసు కథ సమకూర్చి తొలిసారి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Vijay Sethupathi and Surya Sethupathi

కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) తనయుడు సూర్య సేతుపతి (Surya Sethupathi) వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నారు. ‘ఫీనిక్స్‌’ (వీళాన్‌) (Phoenix) పేరుతో తెరకెక్కించే ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం చెన్నై నగరంలోని ఏవీఎం స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది. బ్రేవ్‌మేన్‌ పిక్చర్స్‌ పతాకంపై రాజలక్ష్మి అరసు కుమార్‌ నిర్మిస్తుండగా, ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ ‘అనల్‌’ అరసు (Anl Arasu) కథ సమకూర్చి తొలిసారి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యతో పాటు ‘కాక్కాముట్టై’ ఫేం విఘ్నేష్‌, వర్ష, అభి నక్షత్ర, సత్యన్‌ ఎన్‌జే, సంపత్‌, హరీష్‌ ఉత్తమన్‌, దిలీపన్‌ తదితరులు నటిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్ర షూటింగ్‌ సంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ‘‘అనల్‌’ అరసు సొంతంగా బ్రేవ్‌మేన్‌ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం గమనార్హం. (Surya Sethupathi Debut Film Launch)


ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా హీరో సూర్య విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో డాడీకి నాకు పోలిక లేదు. అందుకే నా పేరు వెనుక కూడా నాన్న పేరు లేదు. ఆ పేరు లేకుండా.. నా అంతటగా నేను పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. టైటిల్‌ కార్డులో కూడా.. కేవలం సూర్య అని మాత్రమే ఉంది. చిత్రపరిశ్రమలోకి నేను అడుగు పెడుతుందటం మమ్మీడాడీలకు సంతోషమే. డాడీని, ఆయన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కొంత భయంగా ఉంది. సాధారణంగా సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలు అంటే అమితమైన ఇష్టం. నేను నటించే తొలి చిత్రంలోనే అలాంటి భారీ యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడం సంతోషంగా ఉంది. ఈ కోరిక ‘అనల్‌’ అరసు ద్వారా నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. (Surya Sethupathi Turns Hero)


ఇవి కూడా చదవండి:

====================

*Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..

******************************

*Vikram Rathod: విజయ్ ఆంటోని సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.

*******************************

*Eagle: రవితేజ సినిమాకి ఇంకా 50 రోజులే..

********************************

Updated Date - 2023-11-25T15:40:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!