Eagle: రవితేజ సినిమాకి ఇంకా 50 రోజులే..

ABN , First Publish Date - 2023-11-24T18:24:39+05:30 IST

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. ఈ సినిమా థియేట్రికల్ రాకకు కౌంట్‌డౌన్ మొదలైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. మరో 50 రోజుల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Eagle: రవితేజ సినిమాకి ఇంకా 50 రోజులే..
Mass Maharaja Ravi Teja in Eagle

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle). ఈ సినిమా థియేట్రికల్ రాకకు కౌంట్‌డౌన్ మొదలైంది. కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈగల్ నుంచి రవితేజ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ 50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌లో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. స్టైలిష్‌ డ్రెస్సింగ్‌లో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు. ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. కావ్య థాపర్ (Kavya Thapar), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం. (Eagle Movie Latest Update)


Eagle.jpg

కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. దావ్‌జాంద్ సంగీత సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలెట్టారు.


ఇవి కూడా చదవండి:

====================

*Akka: కీర్తి సురేష్, రాధికా ఆప్టేలతో రహస్యంగా YRF వెబ్ సిరీస్

*******************************

*Chandra Mohan: నాన్న ఎప్పుడూ ఏం చెప్పేవారంటే.. - చంద్రమోహన్ కుమార్తె

*******************************

*Director Teja Marni: కథలు రాయలేక కాదు.. కథలు లేక కాదు.. రీమేక్స్ చేసేది అందుకే!

****************************

Updated Date - 2023-11-24T18:24:40+05:30 IST