Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..

ABN , First Publish Date - 2023-11-24T23:00:11+05:30 IST

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాని చూసిన వారంతా కచ్చితంగా ప్రేమలో పడతారని తాజాగా ట్రైలర్ రిలీజ్ వేడుకలో నాని చెప్పుకొచ్చారు.

Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..
Natural Star Nani

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘హాయ్ నాన్న’ (Hi Nanna). వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నాని సరసన ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ముఖ్యంగా నాని కెరీర్‌లో మరో వైవిధ్యభరిత చిత్రంగా నిలిచేలా అనిపిస్తోంది. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు భిన్నంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Hi Nanna Trailer Launched)

ట్రైలర్‌ లాంచ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చూసుకున్నపుడు ‘వీడెవడో బావున్నాడు’ అని అనిపించింది ఈ సినిమాకే(నవ్వుతూ). శౌర్యువ్ రాసుకున్న కథలో సాన్ జాన్ చూపించిన విజివల్స్‌లో చాలా బావుంటాను. టీజర్, పాటలు ఇప్పుడు ట్రైలర్ చూశారు. కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత వుంది. మీరంతా సినిమాతో ప్రేమలో పడిపోవడం ఖాయం. సినిమా అనేది నాకు ఆక్సిజన్‌తో సమానం. సినిమా అనేది నిజంగా నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. డిసెంబర్ 7కి మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ బాధ్యత నాది, మా టీం అందరిది. బాక్సాఫీసు బాధ్యత మీది. ప్రామిస్. అందరికీ పేరుపేరునా లవ్ యూ సో మచ్ అని చెప్పుకొచ్చారు. (Nani About Hi Nanna Movie)


Nani-Pic.jpg

రైటర్ కాశి మాట్లాడుతూ.. శౌర్యువ్ అద్భుతమైన కథ రాశారు. ఈ కథ విన్న తర్వాత స్పెల్ బౌండ్ అయిపోయాను. కొత్త రచయిత దర్శకులకు స్ఫూర్తిని ఇచ్చే హీరో నాని. మంచి కథని ప్రోత్సహించే హీరో. ఆయనకు కథ నచ్చితే చాలు. మరో విషయం గురించి అలోచించరు. శౌర్యువ్ ప్రతిభని డిసెంబర్ 7న చూస్తారు. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని అందరూ థియేటర్‌లో చూడాలని కోరారు. ఈ వేడుకలో దర్శకుడు శౌర్యువ్, నిర్మాత మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల భారీ స్థాయిలో విడుదలకానుంది. (Hi Nanna Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Vikram Rathod: విజయ్ ఆంటోని సినిమాకు విడుదల తేదీ ఫిక్సయింది.

*******************************

*Eagle: రవితేజ సినిమాకి ఇంకా 50 రోజులే..

********************************

*Akka: కీర్తి సురేష్, రాధికా ఆప్టేలతో రహస్యంగా YRF వెబ్ సిరీస్

*******************************

Updated Date - 2023-11-24T23:00:13+05:30 IST