Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?

ABN , First Publish Date - 2023-04-21T09:15:41+05:30 IST

ఇప్పటి వరకు ట్విట్టర్‌లో వినిపిస్తున్న అభిప్రాయాల ప్రకారం చిత్రానికి పాజిటివ్ టాకే వినిపిస్తుంది. ఒకరిద్దరు మినహా.. సినిమాపై నెగిటివ్‌గా

Virupaksha Twitter Review: ‘విరూపాక్ష’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..?
Virupaksha Twitter Review

సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మేజర్ ప్రమాదం తర్వాత.. చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21 అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ నుంచే షోలు పడటంతో.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో వినిపిస్తున్న అభిప్రాయాల ప్రకారం చిత్రానికి పాజిటివ్ టాకే వినిపిస్తుంది. ఒకరిద్దరు మినహా.. సినిమాపై నెగిటివ్‌గా ఎవరూ రెస్పాండ్ కాలేదు. ట్విట్టర్‌లో ‘విరూపాక్ష’ టాక్ (Virupaksha Twitter Talk) ఎలా ఉందంటే..


*హారర్ ఎలిమెంట్స్‌తో నిండిన మంచి విలేజ్ థ్రిల్లర్ విరూపాక్ష. కొన్ని ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు, మరియు చక్కని మలుపులతో కూడిన ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్టాప్‌లో వచ్చే లవ్ ట్రాక్ కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. స్ర్కీన్‌ప్లే హైలెట్‌గా సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుంది.. అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3 రేటింగ్ ఇచ్చారు. (Virupaksha Talk)


*హారర్ సస్పెన్స్‌తో కూడిన కథాంశమిది. ట్విస్ట్‌లు బాగున్నాయి. సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ నటనతో ఇంప్రెస్ చేశారు. ఫస్టాఫ్ కొంచెం బోరింగ్‌గా ఉంది. సెకండాఫ్ ట్విస్ట్‌లతో ఇంట్రెస్టింగ్‌గా నడిచింది. చంద్రముఖి సినిమాను గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. సంగీతం, స్ర్కీన్‌ప్లే సినిమాకు ప్లస్. (Virupaksha Rating)


*ఇప్పుడే ఫస్టాఫ్ పూర్తయింది. బ్లాక్‌బస్టర్ ఫస్టాప్. నా రేటింగ్ 3.25. సస్పెన్స్‌ని చాలా చక్కగా మెయింటైన్ చేశారు. స్క్రీన్‌ప్లే అదిరింది. కొన్ని సీన్స్ అయితే అరుపులే.. సెకండాఫ్ కూడా పూర్తయింది. బ్లాక్‌బస్టర్ బొమ్మ. స్కీన్‌ప్లే, డైరెక్షన్, స్టోరీ, బిజీఎమ్, సినిమాటోగ్రఫీ, మూవీ క్యాస్ట్ ఇవన్నీ సినిమాకి పాజిటివ్స్. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ ఇది. (BlockBuster Talk To Virupaksha)


*శ్వాసని బిగపట్టండి.. ఫస్టాఫ్ చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. కార్తిక్ దండు తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. హర్రర్ మెయింటైన్ చేస్తూ.. చాలా బాగా తీశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది. సాయిధరమ్ తేజ్‌కు మంచి కంబ్యాక్ చిత్రమిది. సెకండాఫ్‌పై ఇంట్రస్ట్ కలిగించేలా ఫస్టాప్‌ ప్లాట్ నడిచింది. (Virupaksha Twitter Review)


* తలా తోకా లేని కథతో సినిమా చేశారు. రెగ్యులర్ కాన్సెప్ట్.. కొత్తదనం ఏమీ లేదు. ఫ్రెష్‌గా ఫీలవడానికి కూడా ఇందులో ఏం లేదు. సాయిధరమ్ తేజ్ మ్యాగ్జిమమ్ ఎఫర్ట్ పెట్టాడు. డైరెక్టర్ వెర్షన్‌లో సంయుక్తా మీనన్‌ క్లీవేజ్ షాట్స్‌ ఈ సినిమాకి హైలెట్స్ అని చెబుతూ.. సౌత్ డిజిటల్ మీడియా 2 రేటింగ్ ఇచ్చింది (Virupaksha Movie). అసలు ఈ సినిమా పరిస్థితి ఏమిటి? ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇందులో ఉన్న మ్యాటర్ ఏమిటి? అనేది కాసేపట్లో పూర్తి రివ్యూలో.


ఇవి కూడా చదవండి:

************************************************

*Mrunal Thakur: ఈమె ‘సీతా రామం’ సీత అంటే ఎవరూ నమ్మరు కాక నమ్మరంతే..!

*Shamlee: 50కి పైగా చిత్రాల్లో నటించిన ‘ఓయ్’ షామ్లీ.. ప్రస్తుత టార్గెట్ ఏంటో తెలుసా?

*Pawan Kalyan: OG సెట్స్‌లో పవర్ స్టార్.. లుక్ అదిరిందిగా..!

*Ram Charan: భార్య కోసం రామ్ చరణ్ సంచలన నిర్ణయం

*Dasara: నాని ‘దసరా’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

Updated Date - 2023-04-21T10:00:18+05:30 IST