కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shivathmika Rajasekhar: మరో తమిళ ఫిల్మ్‌లో ఛాన్స్.. హీరో ఎవరంటే..

ABN, First Publish Date - 2023-08-28T10:15:26+05:30

జీవిత, రాజశేఖర్ కుమార్తెలు తెలుగుతో పాటు తమిళ్‌లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే శివాత్మిక తమిళ ప్రేక్షకుల నుంచి గుర్తింపును సొంతం చేసుకుంది కూడా. సరైన విజయం అయితే ఆమెకి ఇంకా దక్కలేదు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా ఆమె అర్జున్ దాస్ సరసన నటిస్తోన్న చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.

Shivathmika Rajasekhar

జీవిత, రాజశేఖర్ (Jeevitha and Rajasekhar) కుమార్తెలు తెలుగుతో పాటు తమిళ్‌లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే శివాత్మిక తమిళ ప్రేక్షకుల నుంచి గుర్తింపును సొంతం చేసుకుంది కూడా. సరైన విజయం అయితే ఆమెకి ఇంకా దక్కలేదు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడామెకు మరో అవకాశం వరించింది. తమిళ చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొంది, హీరోగా నటిస్తున్న అర్జున్‌దాస్ సరసన శివాత్మిక రాజశేఖర్‌ (Shivathmika Rajasekhar) హీరోయిన్‌గా నటించనుంది.


జెంబ్రియో పిక్చర్స్‌ బ్యానరుపై సుధా సుకుమార్‌ నిర్మించే ఈ చిత్రంలో కాళి వెంకట్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సిల నేరంగలిల్‌ సిల మణిదర్‌గల్‌’ ఫేం విశాల్‌ వెంకట్‌ దర్శకత్వంలో జీవిత వినోదాన్ని వివరించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమలతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా హీరో అర్జున్‌ దాస్‌ (Arjun Das) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నాజర్‌ వంటి పెద్ద నటుడితో కలిసి పని చేయబోతున్నాను. సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ అభిమానిని నేను. ఆయన సంగీతం అందించడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మదురై వచ్చి కథ చెప్పారు. అపుడే ఓకే చెప్పాను. దర్శకుడిపై భారం వేసి ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘అనీతి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు కూడా వారి మద్దతు కోరుతున్నాను’’ అని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Raghava Lawrence: ‘చంద్రముఖి’గా కంగనా ర‌నౌత్‌ అనగానే భయపడిపోయా..

***************************************

*Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న ఐకాన్ స్టార్

*****************************************

*Prakash Raj and Bobby Simha: నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు

*****************************************

*Kartikeya Gummakonda: నేనలా చెప్పగానే.. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు

*****************************************

Updated Date - 2023-08-28T10:21:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!