Prakash Raj and Bobby Simha: నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు

ABN , First Publish Date - 2023-08-26T18:54:13+05:30 IST

దిండిగల్‌ జిల్లాలో ప్రముఖ వేసవి విడిది కేంద్రమైన కొడైకెనాల్‌ పరిధిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన సినీ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహాలకు నోటీసులు జారీ చేయనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.

Prakash Raj and Bobby Simha: నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు
Prakash Raj and Bobby Simha

దిండిగల్‌ (DINDIGUL) జిల్లాలో ప్రముఖ వేసవి విడిది కేంద్రమైన కొడైకెనాల్‌ (Kodaikanal) పరిధిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన సినీ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహాలకు నోటీసులు జారీ చేయనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. కొడైకెనాల్‌ సమీపంలోని విల్‌పట్టి పంచాయతీ పరిధిలో ఉన్న పొత్తుపారై భారతి అన్నానగర్‌లో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్రభుత్వ అనుమతి పొందకుండా ఇళ్లు, అటవీ శాఖకు సొంతమైన స్థలంలో సిమెంట్‌ రోడ్డు వేశారని ఆరోపణలున్నాయి.


అదే ప్రాంతంలో మరో నటుడు బాబీ సింహా (Bobby Simha) కూడా అనుమతి పొందకుండా మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు దిండుగల్‌ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో రైతులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు దిండిగల్‌ తహసీల్దార్‌ రాజా నేతృత్వంలోని అధికారుల బృందం అనుమతి లేకుండా కట్టడాలు నిర్మితమవుతున్న ప్రాంతాలు పరిశీలించారు. వీటికి ప్లానింగ్‌, పంచాయతీ, రెవెన్యూ, అటవీ శాఖల నుంచి అనుమతి పొందని పక్షంలో వివరణ కోరుతూ త్వరలోనే నోటీసు (Notice) జారీ చేయనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Prakash.jpg

కాగా ఈ ఇద్దరు సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)లో మైఖేల్‌ సీజర్‌, సాల్మన్‌ సీజర్‌ పాత్రలలో అన్నదమ్ములుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. తెలుగువాడైన బాబీ సింహా.. తమిళ్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆయన బిజీ నటుడిగానే కొనసాగుతున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడిగా దాదాపు అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడీ ఇద్దరికీ నోటీసులు అనేలా వార్తలు రావడంతో ‘వాల్తేరు వీరయ్య’ విలన్స్‌కి నోటీసులు అంటూ నెటిజర్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kartikeya Gummakonda: నేనలా చెప్పగానే.. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు

*****************************************

*Jovika: కుమార్తెను లైన్‌లోకి దించుతోన్న వనితా విజయ్ కుమార్

***************************************

*Abhishek Agarwal: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కి రెండు జాతీయ అవార్డులు.. నిర్మాత స్పందన ఇదే

***************************************

Updated Date - 2023-08-26T18:54:13+05:30 IST