Kartikeya Gummakonda: నేనలా చెప్పగానే.. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు

ABN , First Publish Date - 2023-08-26T17:17:13+05:30 IST

కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుందని అన్నారు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆయన హీరోగా, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది.

Kartikeya Gummakonda: నేనలా చెప్పగానే.. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు
Bedurulanka 2012 Team

కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుందని అన్నారు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda). ఆయన హీరోగా, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి (Neha Sshetty) హీరోయిన్‌గా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. నూతన దర్శకుడు క్లాక్స్ (Director Clax) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసిన, మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు థాంక్స్. సక్సెస్ వచ్చినప్పుడు, మనం అనుకున్న సినిమా హిట్ అయినప్పుడు... సినిమాలు వస్తాయి. మంచి కథలు వస్తాయి. అవి పక్కన పెడితే.. ‘బెదురులంక 2012’ విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు నచ్చుతుంది? అనుకున్నానో... వాటికి మంచి పేరు వచ్చింది. సెకండాఫ్ అంతా నవ్వుతూ ఉన్నామని, చివరి 45 నిమిషాలు నవ్వుతూనే ఉన్నామని ముక్త కంఠంతో అందరూ చెబుతున్నారు. సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం ఇంతకు ముందు చూడలేదు. అటువంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. (Bedurulanka 2012 Success Meet)

Bedurulanka-2012.jpg

మా టీమ్‌తో కలిసి నేను థియేటర్లకు వెళ్లాను. హౌస్‌ఫుల్ కావడం చూసి సంతోషం వేసింది. దర్శకుడు ఇతనే అని క్లాక్స్‌ని పరిచయం చేయగా 2 నిమిషాల పాటు అందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మేం రిలాక్స్డ్ గా ఉన్నాం. నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాత బెన్నీ గారికి థాంక్స్. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. నేహా శెట్టి ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల ఈ సక్సెస్‌మీట్‌కు రాలేకపోయింది. మా ట్రైలర్‌ విడుదల చేసిన రామ్‌ చరణ్‌‌గారికి, మొదటి నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాకు స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్‌గారి పేరు.. శివ శంకర వరప్రసాద్‌ అని ఈ సినిమాలో పెట్టుకున్నా. నాకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు థాంక్స్‌’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Jovika: కుమార్తెను లైన్‌లోకి దించుతోన్న వనితా విజయ్ కుమార్

***************************************

*Abhishek Agarwal: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కి రెండు జాతీయ అవార్డులు.. నిర్మాత స్పందన ఇదే

***************************************

*Jawan: షారుఖ్ ఖాన్ ఎన్ని గెటప్స్‌లో కనిపించబోతున్నాడో చూశారా.. పోస్టర్ అదిరింది

**************************************

Updated Date - 2023-08-26T17:20:17+05:30 IST