సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు

ABN, First Publish Date - 2023-05-02T15:05:34+05:30

కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా ఉన్నా. ఇప్పుడు రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నా. ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ చిత్రం ప్రమోషన్‌లో నేను పాల్గొనలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమోషన్లకు నన్ను..

Senior Actor Sarath Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ చిత్రపరిశ్రమ (Kollywood)లో ప్రముఖ నటుడుగా ఉన్న సుప్రీం స్టార్‌ శరత్‌ కుమార్‌ (Sarath Kumar) మళ్ళీ బిజీ నటుడిగా మారిపోయారు. ఏకంగా 20 చిత్రాల్లో నటించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా విడుదలైన ‘రుద్రన్‌’ (Rudran)లో భూమి అనే విలన్‌ పాత్ర, ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ (Ponniyin Selvan 2)లో పెరియ పళువేట్టైయార్‌ (Periya Pazhuvettaraiyar) పాత్రలో ఆయన నటించారు. ఈ రెండు పాత్రలు ఆయన నటనకు అద్దంపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాల తర్వాత ఆయన కమిట్‌ అయిన ప్రాజెక్టుల గురించి తెలిపేందుకు తాజాగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా ఉన్నా. ఇప్పుడు రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నా. ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ చిత్రం ప్రమోషన్‌లో నేను పాల్గొనలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమోషన్లకు నన్ను కూడా ఆహ్వానించారు. కానీ చెన్నైలో లేకపోవడంతో హాజరుకాలేదు. ‘పీఎస్’ (PS)లో ఒక పాత్రలో అవకాశం కల్పించినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ‘వారిసు’ (Varisu) ద్వారా నేటి యువతరానికి నన్ను పరిచయం చేసిన హీరో విజయ్‌ (Vijay), దర్శకుడు వంశీ (Vamshi Paidipally)కి కృతజ్ఞతలు.

‘రుద్రన్‌’లో విలన్‌గా చేయాలని ఆఫర్‌ వచ్చినపుడు కాస్త వెనుకంజ వేశా. కానీ, ఇపుడు అనేక మంది హీరోలు ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. విలన్‌ వేషం (Villain Role) వేయడాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ పాత్రకు న్యాయం చేశారా లేదా అన్నదే చూస్తున్నారు. అందుకే ధైర్యం చేశా. నేను హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే అధిక చిత్రాల్లో నటిస్తున్నా. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లు ఇలా సినిమా అనే చక్రంలో బొంగరంలా తిరుగుతున్నా. రాజకీయాల (Politics) గురించి 2026లో ఒక ఆసక్తికరమైన వార్తను వెల్లడిస్తా. ఎల్లవేళలా మీ సహాయ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నటుడు శరత్‌ కుమార్‌ (Actor Sarath Kumar) చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

*PS2: కలెక్షన్ల ఊచకోత మొదలైంది..

*Dil Raju: మేరా దిల్ ఖుష్ హువా..

*Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న నిధి.. సంచలన నిర్ణయం

*Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?

Updated Date - 2023-05-02T15:05:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!