Pawan Kalyan OG: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌‌‌పై ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

ABN , First Publish Date - 2023-06-08T22:59:32+05:30 IST

‘ఓజీ’ (OG) సెట్స్‌లోకి పవన్ కల్యాణ్ అడుగుపెట్టినప్పటి నుంచి.. నిర్మాణ సంస్థ ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానుల్లో హుషారు నింపుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌‌ ఇవ్వడంతో.. నిర్మాణ సంస్థపై ఫ్యాన్స్ ప్రేమ కురిపిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒక నిర్మాణ సంస్థపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Pawan Kalyan OG: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌‌‌పై ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
Pawan Kalyan In OG

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా.. యువ దర్శకుడు సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (DVV Entertainment) పతాకంపై ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత (RRR Producer) డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ‘ఓజీ’ (OG) (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అని పిలుస్తున్నారు. జనవరి 30న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైనప్పటి నుంచి నిర్మాణ సంస్థ ఏదో ఒక అప్‌డేట్‌ని ఇస్తూ.. ఫ్యాన్స్‌లో హుషారు నింపుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ ప్యాక్‌డ్ షెడ్యూల్ మొదలైందని తెలుపుతూ.. సెట్‌లో పవన్ కల్యాణ్ అడుగుపెట్టినట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Kalyan-2.jpg

ఈ ప్రకటనతో పాటు ‘ఓజీ ఎంటర్స్ ద సెట్’ (OG Enters the Set) అంటూ వైట్ అండ్ వైట్‌లో ఉన్న పవన్ కల్యాణ్ నడిచి వస్తున్న ఓ పిక్‌ని కూడా విడుదల చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకనుకుంటున్నారా? పవన్ కల్యాణ్ ప్రస్తుతం నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. అలాంటిది ఆ సినిమాలకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్‌ని మేకర్స్ ఇవ్వడం లేదు. ఆఖరికి పవన్ కల్యాణ్ ఆ సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నా సరే.. కామ్‌గానే ఉన్నారు. కానీ డీవీవీ వాళ్లు మాత్రం.. పవన్ కల్యాణ్ సెట్‌లోకి ఎంటరైతే చాలు.. అప్‌డేట్స్‌తో అల్లాడించేస్తున్నారు. ఇది ఆయన ఫ్యాన్స్‌కి ఎంతగానో నచ్చేసింది. ఆయన ఫ్యాన్సే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్‌ కూడా.. ‘మా హీరోలు కూడా ఈ బ్యానర్‌లో సినిమా చేస్తే బాగుండు’ అనేలా కామెంట్స్ చేస్తున్నారంటే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఫ్యాన్స్‌ని ఖుష్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వచ్చిన అప్‌డేట్‌తో ‘ఓజీ’ మరోసారి ట్రెండ్ అవుతోంది. (Pawan Kalyan Fans Happy with OG Updates)

Kalyan-1.jpg

‘ఓజీ’ విషయానికి వస్తే.. భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ (Ravi K Chandran) కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak)కి సంగీతం అందించిన ఎస్ థమన్ (S Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కల్యాణ్ బలానికి, స్టార్‌డమ్‌కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. అటు యాక్షన్ ప్రియులను, ఇటు పవన్ కల్యాణ్ అభిమానులను అలరిస్తుందని నిర్మాత డీవీవీ దానయ్య (Producer Danaiah) ఎంతో నమ్మకంగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Hero Siddharth: ఓ పెద్దావిడను చూసి భోరున ఏడ్చేసిన సిద్ధార్థ్.. ఆమె ఎవరో తెలుసా?

*Adipurush: సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ వచ్చిందో తెలుసా?

*Bhagavanth Kesari: జూన్ 10న బాలయ్య ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్.. ఇక్కడా 108కి లింక్!

*Sharwanand: రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన శర్వా..

*Adipurush: తిరుమలలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్, హీరోయిన్‌ల వ్యవహారంపై కేసు

Updated Date - 2023-06-08T23:52:10+05:30 IST