VarunLavanya: నిశ్చితార్థం అయిపోయింది.. సాంప్రదాయ పద్ధతిలో లావణ్య.. ఫొటోలు వైరల్
ABN , First Publish Date - 2023-06-09T20:42:22+05:30 IST
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జూన్ 9వ తేదీన మెగా బ్రదర్ నాగబాబు ఇంటిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగా, అల్లు, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. పెళ్లి ఎప్పుడనే సమాచారం ఇంకా బయటకు రాలేదు కానీ.. ఈ నిశ్చితార్థానికి వెళుతున్న సెలబ్రిటీల ఫొటోలు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీ కపుల్‌గా మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠీ (Lavanya Tripati) త్వరలోనే మారబోతున్నారు. వారిద్దరి ప్రేమ ఫలించి పెళ్లి పీటల వరకు వెళ్లబోతోంది. చాలా రోజులుగా వరుణ్, లావణ్య (Varun and Lavanya)ల ప్రేమ గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. సరైన క్లారిటీ మాత్రం రాలేదు. రెండు రోజుల క్రితం వారే స్వయంగా తమ నిశ్చితార్థం అని ప్రకటించారు. శుక్రవారం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా మెగా బ్రదర్ నాగబాబు ఇంటిలో జరిగింది.

అయితే ఈ వేడుక ప్రైవేట్ పార్టీగా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మాత్రమే జరిగినట్లుగా తెలుస్తోంది. నిశ్చితార్థం కుటుంబ, దగ్గర బంధువుల సమక్షంలో జరిగినా.. పెళ్లి వేడుక మాత్రం చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని అంటున్నారు. (Varun Tej and Lavanya Tripathi Engagement)

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి వారు కారులో వెళుతున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే కాబోయే పెళ్లి కూతురు లావణ్య త్రిపాఠి కూడా సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకకు హాజరైంది. వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకకు సంబంధించి ప్రస్తుతం ఈ ఫొటోలు మినహా.. ఎటువంటి అప్‌డేట్ రాలేదు. నిశ్చితార్థం అనంతరం వరుణ్, లావణ్యల పెళ్లి తేదీని మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

అంతకు ముందు ‘రెండు హృదయాలు.. ఒకటే ప్రేమ’ అంటూ నిశ్చితార్థానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ ఒకటి బయటికి రావడంతో.. జూన్ 9న వరుణ్, లావణ్యల నిశ్చితార్థం అని అధికారికంగా బయటకు వచ్చింది.

అంతకు ముందే ఈ తేదీన నిశ్చితార్థం అనేలా వార్తలు వైరల్ అయినప్పటికీ ఈ ఇన్విటేషన్ కార్డ్ వచ్చిన తర్వాతే.. వరుణ్, లావణ్యల ప్రేమని అంతా నిజమని నమ్మారు. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్, అంతరిక్షం’ వంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:
************************************************
*Mahi V Raghav: ‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అయినా ముందే హెచ్చరిక చేశాం
*Karthika: రెజీనా చదివే బుక్‌లో.. దెయ్యంగా కాజల్ అగర్వాల్!
*Anasuya: అలసిపోయాను.. ఇక ఆపేస్తున్నాను
*Pawan Kalyan OG: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఫ్యాన్స్ ట్వీట్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
*Hero Siddharth: ఓ పెద్దావిడను చూసి భోరున ఏడ్చేసిన సిద్ధార్థ్.. ఆమె ఎవరో తెలుసా?