సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maamannan: చివరి నిమిషంలో తొలగిన కోర్టు చిక్కులు.. టాక్ ఏంటంటే?

ABN, First Publish Date - 2023-06-29T21:43:46+05:30

‘‘సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు అనుమతి ఇచ్చింది. సినిమాను చూసిన ప్రేక్షకులు ఆ చిత్రం గురించి రెండు రోజుల్లో మరిచిపోతారు. ఇక శాంతిభద్రతల సమస్య అంశాన్ని పోలీసులు చూసుకుంటారు. అందువల్ల విడుదలపై స్టే విధించలేం’’ అంటూ కోర్టు తీర్పునివ్వడంతో తమిళ నాట ‘మామన్నన్’ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ప్రస్తుతం చిత్రానికి పాజిటివ్ టాకే వినిపిస్తోంది.

Maamannan Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) - డైరెక్టర్‌ మారి సెల్వరాజ్‌ (Mari Selvaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మామన్నన్‌’ (Maamannan) చిత్రం విడుదలకు ముందు ఎదురైన న్యాయపరమైన చిక్కులు వీడిపోయాయి. దీంతో ఈ చిత్రం ముందుగా ప్రకటించినట్టుగానే జూన్‌ 29న గ్రాండ్‌గా విడుదల చేశారు. ఉదయనిధి, వడివేలు (Vadivelu), కీర్తిసురేష్‌ (Keerthi Suresh), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా స్టే విధించాలని కోరుతూ నెల్లై జిల్లా పాలయంకోట్టైకు చెందిన మణికంఠన్‌ (Manikantan) అనే వ్యక్తి హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసి అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరిన విషయం తెలిసిందే. (Maamannan Released)

‘‘ఈ సినిమా ఒక సామాజిక వర్గానికి చెందిన మూవీ. ఈ చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన గత చిత్రం ‘కర్ణన్‌’ కూడా కొడియన్‌కుళం గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇపుడు విడుదల చేసిన ‘మామన్నన్‌’ ట్రైలర్‌, పాటలు కూడా రెండు వర్గాల మధ్య ఘర్షణలను చూపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైతే దేవర్‌, దేవేంద్రకుళ వేలాలర్‌ వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అందువల్ల చిత్రం విడుదలపై స్టే విధించాలి’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మదురై బెంచ్‌... ‘‘సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు అనుమతి ఇచ్చింది. సినిమాను చూసిన ప్రేక్షకులు ఆ చిత్రం గురించి రెండు రోజుల్లో మరిచిపోతారు. ఇక శాంతిభద్రతల సమస్య అంశాన్ని పోలీసులు చూసుకుంటారు. అందువల్ల విడుదలపై స్టే విధించలేం’’ అంటూ కోర్టు తీర్పునిచ్చింది (Court Verdict on Maamannan Case). దీంతో ‘మామన్నన్‌’ విడుదలకు అడ్డు తొలగిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కోలీవుడ్‌ (Kollywood)లో పాజిటివ్ స్పందనే వినిపిస్తోంది. మారి సెల్వరాజ్ మరో హిట్ కొట్టాడంటూ.. సోషల్ మీడియాలో సైతం టాక్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..


**************************************

*Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..


**************************************

*Slum Dog Husband: నందమూరి హీరో చేతుల మీదుగా ట్రైలర్ విడుదల


**************************************

*Balakrishna and Sridevi Combo: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని మించి ఉండాల్సిన సినిమా.. ఆగిపోయింది


**************************************

*Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!


**************************************

Updated Date - 2023-06-29T21:43:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!