L2 Empuraan: ‘లూసిఫర్ 2’కు లైకా కనెక్షన్.. ఈసారి మాములుగా ఉండదట!

ABN , First Publish Date - 2023-09-30T22:26:10+05:30 IST

2019లో ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమా ‘లూసిఫ‌ర్’ ఎంత‌టి ఘ‌న విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. ఇప్పుడా ‘లూసిఫర్’కి కొన‌సాగింపుగా ‘ఎల్2 ఎంపురాన్’ (L2 Empuraan) చిత్రం మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యాన‌ర్‌తో పాటు కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కల‌యిక‌లో, జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ నేతృత్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది.

L2 Empuraan: ‘లూసిఫర్ 2’కు లైకా కనెక్షన్.. ఈసారి మాములుగా ఉండదట!
L2 Empuraan Still

టాలీవుడ్ రేంజ్ ఆస్కార్‌కి చేరినా.. ఇంకా రీమేక్స్ విషయంలో మలయాళ ఇండస్ట్రీ వైపే అంతా చూస్తుండటం విశేషమని చెప్పుకోవాలి. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం.. మలయాళ సినిమాలను రీమేక్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అలా మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. అలాంటి మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీ నుంచి అటు మాస్‌, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ కంప్లీట్ యాక్ట‌ర్ ఇమేజ్‌ను సంపాదించుకున్న న‌టుడు మోహ‌న్ లాల్‌ (Mohanlal). చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నాలుగు ద‌శాబ్దాల పైగా అనుభ‌వం, 350కి పైగా సినిమాలు ఆయ‌న్ని తిరుగులేని క‌థానాయ‌కుడిగా నిల‌బెట్టాయి. ఆయ‌న న‌ట‌న‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసి ఇప్ప‌టికీ హ‌య్య‌స్ట్ పెయిడ్ యాక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు.

మోహన్ లాల్ సంగతి ఇలా ఉంటే.. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌రో న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న మ‌ల‌యాళం స‌హా ప‌లు భాష‌ల్లో ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి అల‌రించారు. 2019లో ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమా ‘లూసిఫ‌ర్’ (Lucifer) ఎంత‌టి ఘ‌న విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని ‘గాడ్ ఫాదర్’ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. ఇప్పుడు ‘లూసిఫర్’కి కొన‌సాగింపుగా ‘ఎల్2 ఎంపురాన్’ (L2 Empuraan) చిత్రం మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నుంది. ఆంటోని పెరంబ‌వూర్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతోన్న ఆశీర్వాద్ సినిమాస్ (Aashirvad Cinemas) బ్యాన‌ర్‌తో పాటు కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) కల‌యిక‌లో, జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ (G.K.M Tamil Kumaran) నేతృత్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది.


Mohanlal.jpg

సంస్కృతి, సాంప్ర‌దాయ‌ల‌కు విలువ‌నిచ్చే కేర‌ళలో.. సినీ నిర్మాణ రంగంలోకి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాతో అడుగుపెడుతోంది. ఈ సంద‌ర్భంగా కేర‌ళ ప్రాంతం లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థకు హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ‘ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan)’ నిర్మాణ భాగ‌స్వామి ఆశీర్వాద్ సినిమాస్ తెలియ‌జేసింది. ‘లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్‌ (Subaskaran) వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ఆస‌క్తిని చూపుతుంటారు. సినిమాల‌పై ఆయ‌నుకున్న ప్యాష‌న్‌ అలాంటిది. లైకా ప్రొడక్షన్స్ మలయాళంలో సినిమాల తీయటానికి సిద్ధమవటం అనేది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహ‌దం చేయ‌ట‌మే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల‌కు ఎన్నో కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను చూసే అవ‌కాశాల‌ను క‌లిగించొచ్చు. ఎన్నో గొప్ప చిత్రాల‌ను అందిస్తూ చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి మార్గ‌నిర్దేశం చేస్తుంది లైకా సంస్థ‌. అదే పంథాను ఇక్క‌డ కూడా కొన‌సాగిస్తార‌ని న‌మ్ముతున్నాం. మా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్ట్‌లో మాతో చేతులు క‌లిపినందుకు వారికి మా ధ‌న్య‌వాదాలు’ అని ఆంటోని పెరంబ‌వూర్ (Antony Perumbavoor) అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vijay Antony: పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. చిన్నకుమార్తెతో కలిసి విజయ్‌ ఆంటోని ఏం చేశాడంటే..

*************************************

*Namrata and Sitara: మానీక్విన్స్ బొమ్మల కొలువులో నమ్రత, సితూ పాప సందడి

************************************

*Vijay Antony: మరో మెగాస్టార్ చిరు మూవీ టైటిల్‌కి ఫిక్సయిన విజయ్ ఆంటోని

************************************

*Baby: ‘బేబీ’ దర్శకుడికి మరో కారు గిఫ్ట్.. సక్సెస్ ఇచ్చిన కిక్కు అలాంటిది

************************************

Updated Date - 2023-09-30T22:26:10+05:30 IST